టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించేల చేసిన చిత్రం బాహుబలి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ కెరియర్ పరంగా వెనక్కి చూసుకోలేదు. భారీ బడ్జెట్ సినిమాలలో నటించి భారీగానే కలెక్షన్స్ సాధించారు. ఈ రోజున ప్రభాస్ 46వ పుట్టినరోజు కావడం చేత అభిమానులు చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఒకప్పుడు సాదాసీదా హీరోగా తన కెరీర్ ని మొదలు పెట్టిన ప్రభాస్ ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుడుగా పేరు సంపాదించారు.


2002 నవంబర్ 11న ఈశ్వర్ సినిమా ద్వారా హీరోగా మారారు. డైరెక్టర్ జయంతి. సి.పరాంజి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్ గా నటించారు. ముఖ్యంగా ప్రభాస్ కొత్త సినిమా కావడం చేత ఈ సినిమాకి ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించాడట. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలోనే తెలిపారు. ఈశ్వర్ సినిమా కోసం కేవలం రూ .4 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారని ఆ సమయంలో అది పెద్ద మొత్తం కాకపోయినా ఆ ప్రారంభం తన జీవితాన్ని మార్చేసిందని తెలిపారు ప్రభాస్.


చత్రపతి, వర్షం, మిర్చి ,బుజ్జిగాడు తదితర చిత్రాలతో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. 2015లో విడుదలైన బాహుబలి చిత్రంతో ప్రభాస్ కెరియర్ పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా ప్రభాస్ పేరుని మారుమోగేలా చేసింది. బాహుబలి సినిమా కోసం రూ .25 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ .120 నుంచి రూ .150 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు వినిపిస్తున్నాయి. సినిమాలు సక్సెస్ అయిన ఫ్లాప్ అయినా మాత్రం ప్రభాస్ క్రేజీ ఎప్పుడు ఒకేలాగానే ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రాజా సాబ్, సలార్ 2, స్పిరిట్,  ఫౌజీ, కల్కి 2 వంటి చిత్రాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: