టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం "రాజా వారు రాణి గారు" అనే సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈయన ఎస్ ఆర్ కళ్యాణ మండపం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ మూవీ ద్వారా ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఈయన చాలా సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో వినరో భాగ్యము విష్ణు కథ , క అనే సినిమాలతో ఈయనకు మంచి విజయాలు దక్కాయి. ఈయన కొంత కాలం క్రితం దిల్ రుబా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.

సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. తాజాగా ఈ నటుడు కే ర్యాంప్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి పెద్ద స్థాయి కలెక్షన్లు దక్కడం కష్టం అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ కి మంచి కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ సినిమాకు నార్త్ అమెరికాలో సూపర్ సాలిడ్ కలెక్షన్స్ దక్కుతున్నాయి.

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు నార్త్ అమెరికాలో 200 కే కలెక్షన్లు దక్కినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. క సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత దిల్ రుబా మూవీ తో ప్లాప్ ను అందుకున్న కిరణ్ అబ్బవరం "కే ర్యాంప్" మూవీ తో మరో విజయాన్ని అందుకునే అవకాశాలు భారీగా ఉన్నట్లు కొంత మంది అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: