తాజాగా బాహుబలి సినిమాని రెండు భాగాలను కలిపి ఒకే భాగంగా థియేటర్లో విడుదల చేయడానికి సన్నహాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 31వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ప్రభాస్ ,రానా, రాజమౌళి సరదాగా ముచ్చటిస్తున్న ఒక ప్రోమోని సైతం విడుదల చేశారు. రాజమౌళి ఇప్పటికి తన మైండ్ల కొన్ని సీన్స్ అలాగే ఉండిపోయాయంటూ వెల్లడించారు. కట్టప్ప బాహుబలిని చంపడానికి కత్తి పట్టుకున్న సమయంలో వచ్చిన ఎక్స్ప్రెషన్స్ తనకి ఇప్పటికీ గుర్తుకున్నాయని, అలాగే బల్లాల దేవుడు విగ్రహాన్ని పైకి లేపే సమయంలో ప్రభాస్ చేతులు వనికాయ్ అంటూ తెలియజేశారు.
అలాగే ప్రభాస్ సభలో తల నరికే సన్నివేశం గురించి కూడా రానా ముచ్చటించడం జరిగింది. బాహుబలిని కట్టప్ప ఎప్పుడు చంపాడని కాదు కానీ, అతని చంపేందుకు కట్టప్ప సిద్ధమవ్వడమే నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిందంటూ రాజమౌళి వెల్లడించారు. వీరికి సంబంధించి ప్రస్తుతం ఇంటర్వ్యూ ప్రోమో మాత్రం వైరల్ గా మారుతోంది. ఫుల్ ఇంటర్వ్యూ త్వరలోనే రాబోతోందంటూ తెలియజేశారు. ఇదంతా ఇలా ఉంటే బాహుబలి సినిమా రీ రిలీజ్ రోజున హీరో రవితేజ నటించిన మాస్ జాతర సినిమాని విడుదల చేయబోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి