ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 9 కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత సీజన్స్ తో పోలిస్తే ప్రస్తుత సీజన్ చాలా చప్పగానే కొనసాగుతోంది. గతంలో లాగా బిగ్ బాస్ షో పైన ఎవరు ఈ మధ్య పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మొదట్లో బిగ్ బాస్ కామనర్స్ అంటూ ఎవరికి తెలియని వాళ్ళని హౌస్ లోకి తీసుకురావడంతో చాలామందికి ఆసక్తి తగ్గిపోయింది,ఆ తర్వాత వైల్డ్ కార్డు ద్వారా మొత్తం 22 మందిని హౌస్ లోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం 9 మంది ఎలిమినేట్ అయ్యారు.

ఇప్పటికే  చాలా మంది బిగ్ బాస్ విన్నర్ ఎవరనే విషయం పైన తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. తాజాగా ప్రముఖ సీనియర్ నటి కస్తూరి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తాను బిగ్ బాస్ చూడను గతంలో తమిళ బిగ్ బాస్ లో ఒక సెలబ్రిటీ వీక్ కింద ఒక వారం ఉండి వచ్చాను. కానీ తెలుగులో నిఖిల్ నాయర్ ఉన్నారు. అందుకే అప్పుడప్పుడు తెలుగు బిగ్ బాస్ మాత్రమే చూస్తున్నాను అంటూ తెలిపింది. ఈసారి బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ నాయర్ అవుతారంటూ తెలియజేసింది


నిఖిల్ నాయర్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు అతడు ఆడుతాడు, కప్పు గెలుస్తాడు అంటూ తెలిపింది. గృహలక్ష్మి సీరియల్లో నిఖిల్ తనకు కొడుకు పాత్రలో నటించారని, అతడి గురించి నాకు బాగా తెలుసు కాబట్టే చెబుతున్నానని తెలియజేసింది కస్తూరి. ప్రస్తుతం కస్తూరి చేసిన వ్యాఖ్యలకు నిఖిల్ నాయర్ అభిమానులు కూడా తెగ వైరల్ గా చేస్తున్నారు. మలయాళం ఇండస్ట్రీకి చెందిన నిఖిల్ తెలుగులో కూడా పలు సీరియల్స్లలో నటిస్తూ బాగానే క్రేజీ సంపాదించారు. అటు సీరియల్స్ లోనే కాకుండా పలు టీవీ షోలలో కూడా గుర్తింపు రావడంతో ఇటీవల బిగ్ బాస్ 9 వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: