సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న కొంత మంది హీరోలు కేవలం సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా మరికొన్ని క్రాఫ్ట్ లలో తమ టాలెంట్ను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి రామ్ పోతినేని ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. తాజాగా రామ్ పోతినేని , మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందిన ఆంధ్ర కింగ్ తాలుక అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటించగా ... ఉపేంద్రమూవీ లో కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రామ్ కేవలం హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఒక సాంగ్ ను కూడా పాడాడు. ఇప్పటికే ఆ సాంగ్ మేకర్స్ విడుదల చేశారు. ఆ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇక రామ్ రూట్లోనే మరో టాలీవుడ్ కుర్ర హీరో వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా తక్కువ సినిమాల్లోనే హీరోగా నటించిన ప్రతి మూవీతో కూడా విజయాన్ని అందుకొని అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి "అనగనగా ఒక రాజు" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా కోసం నవీన్ మొట్ట మొదటి సారి ఒక సాంగ్ పాడినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఆ సాంగ్ను కూడా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి రామ్ మాదిరి నవీన్ కూడా తాను పాడిన సాంగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: