తెలుగు సినీ ఇండస్ట్రీ రూపురేఖలను మార్చేసిన దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కృష్ణ తర్వాత రమేష్ బాబు, మహేష్ బాబు ,సుధీర్ బాబు ఇలా ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక విజయనిర్మల వారసుడిగా నరేష్ కూడా బాగానే పేరు సంపాదించారు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు కూడా ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మూడవ తరం వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అతను ఎవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ.


జయకృష్ణ  ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. RX -100 మూవీ డైరెక్టర్ గా పరిచయమైన అజయ్ భూపతి డైరెక్షన్లో ఈ సినిమా రాబోతోంది. ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలతోనే ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు ఈ డైరెక్టర్. ఇప్పుడు ఘట్టమనేని జయకృష్ణని హీరోగా పెట్టి సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస మంగాపురం అనే టైటిల్ ని కూడా ఖరారు చేసినట్లు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. సినిమా టైటిల్ ని సంబంధించి అధికారికంగా త్వరలోనే విడుదల కాబోతోంది. జయకృష్ణ కి జోడిగా ఒక స్టార్ హీరోయిన్ కూతురుని తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.

ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత అయినా వైజయంతి మూవీస్ అధినేత అశ్వని దత్  సమర్పణలో రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ ను విడుదల చేస్తూ తిరుపతి  బ్యాక్ డ్రాప్ లో విజువల్స్ ఉండడంతో ఈ సినిమా తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు వినిపిస్తోంది. మరి ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న జయకృష్ణ హీరోగా ఎలా మెప్పిస్తారో చూడాలి మరి. అలాగే ఘట్టమనేని మంజుల కూతురు జాన్వీ స్వరూప్ కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: