దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి - సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా గురించి సినీ ఇండస్ట్రీ అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇది హాలీవుడ్ స్థాయి విజువల్ ట్రీట్‌గా రూపుదిద్దుకోబోతోందని ఇప్పటికే టీమ్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి విజన్, మహేష్ బాబు కరేజ్ కలిస్తే సిల్వర్ స్క్రీన్‌పై కొత్త మేజిక్ చూడబోతున్నామని అభిమానులు అప్పుడే సంబ‌రాల్లో మునిగిపోయారు. ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. గ్లోబల్ స్టార్ ప్రియాంకసినిమా లో శక్తివంతమైన పాత్రలో కనిపించబోతుందట. తాజాగా చిత్ర బృందం పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ కుంభ ” పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఆయన లుక్‌కు విపరీతమైన స్పందన వస్తుండగా, కథలో ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యం అభిమానుల్లో మరింత కుతూహలం రేపుతోంది.


ఇప్పుడు అందరి దృష్టి మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ మీదే ఉంది. మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు ఈ చిత్ర టైటిల్‌ను కూడా ఒకేసారి రివీల్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. అయితే, దానికి ముందు ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ చేయనున్నారు. ఆమె పాత్ర పేరు, లుక్‌ను నవంబర్ 11, 2025న అధికారికంగా విడుదల చేయనున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ జానర్‌లో సాగనుందని, కథలో పురాణాల స్ఫూర్తి కూడా ఉండబోతోందని టాక్. ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్ట్రో ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, కథను విజయేంద్ర ప్రసాద్ రాశారు. సంభాషణలను దర్శకుడు దేవా కట్టా అందిస్తున్నారు.


ఫైన‌ల్‌గా ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నవంబర్ 11న ప్రియాంక లుక్ విడుదల తర్వాత, మహేష్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందన్నదే ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: