రీసెంట్ గా సినిమా హీరో అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. నయనిక రెడ్డిని కుటుంబ సభ్యులు,సన్నిహితులు,స్నేహితుల సమక్షంలో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.అయితే ఈ ఎంగేజ్మెంట్ వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అల్లు శిరీష్ వేసుకున్న చౌకర్ నిలిచింది. అయితే చౌకర్లు అమ్మాయిల పెట్టుకుంటారు. కానీ ఇలా అల్లు శిరీష్ ధరించడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.అంతేకాదు అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ రోజు వేసుకున్న ఈ చౌకర్ విమర్శలకు కూడా దారి తీసింది. ఎంతోమంది అల్లు శిరీష్ గెటప్ పై విమర్శలు, ట్రోల్స్ చేశారు.కొంతమంది మీమర్స్ అయితే రెచ్చిపోయి ఆయన గెటప్ పై విమర్శలు చేసి అల్లు శిరీష్ పరువు తీశారు. 
అయితే సోషల్ మీడియాలో ఇంత జరిగితే అది అల్లు శిరీష్ దగ్గరికి వెళ్లకుండా ఉంటుందా? కచ్చితంగా వెళుతుంది. అలా తాజాగా తనపై వచ్చిన ట్రోల్స్ కి మీమ్స్ కి అల్లు శిరీష్ స్పందించారు. అల్లు శిరీష్ చౌకర్ గురించి మాట్లాడుతూ.. చౌకర్ వేసుకోవడం అనేది కేవలం స్త్రీలకే పరిమితమా.. మగవాళ్ళు వేసుకోకూడదా? పూర్వకాలంలో చక్రవర్తులు,మహారాజులు నెక్లెస్ లు, వడ్డాణాలు పెట్టుకునేవారు. ఇప్పుడు నెక్లెస్ పెట్టుకుంటేనే ఇలా అంటున్నారు. రేపు పెళ్లికి వడ్డానం పెట్టుకుంటే ఏమైపోతారో అంటూ తన ఇన్స్టా గ్రామ్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. 
అంతేకాదు రాజులు వేసుకునే నగలకు సంబంధించిన ఫోటో కూడా షేర్ చేశారు. దీంతో అల్లు శిరీష్ మీమర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చినట్టు అయింది. ఏది ఏమైనప్పటికీ అల్లు శిరీష్ తన ఎంగేజ్మెంట్ కి మెడలో చౌకర్ వేసుకొని కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఒకప్పటి ట్రెండ్ ని మళ్ళీ తీసుకువస్తున్నారు. ఇక అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ రోజు తన మెడలో వేసుకున్న ఆ చౌకర్ విలువ దాదాపు పదివేల డాలర్లు ఉంటుందనే వార్త కూడా వినిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: