టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది హీరోయిన్ నిధి అగర్వాల్. అందం అభినయం ఉన్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటివరకు 8 ప్లాపులను చవిచూసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె క్రేజ్ కూడా రోజురోజుకి తగ్గిపోతొందనే విధంగా అభిమానులు భావిస్తున్నారు. సవ్యసాచి, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలు పరవాలేదు అనిపించుకున్న ఆ తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా ఈమెకు క్రేజీ ను తీసుకురాలేకపోయాయి. ఇక తమిళ భాషలో కూడా కొన్ని ప్రాజెక్టులు మినహాయిస్తే బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ స్టార్ హీరోలతో కూడా అవకాశాలు లభిస్తున్నాయి.


ఎన్నో ఆశలతో నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ తో కలిసి హరిహర వీరమల్లు సినిమాలో నటించగా , ఎన్నో  అడ్డంకులు దాటుకొని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా కూడా మిక్స్డ్ టాక్ ని సంపాదించుకుంది. దీంతో ఈమె ఆశలు కూడా నిరాశ గాని మిగిలాయి. సుమారుగా రెండు సంవత్సరాలకు పైగా డేట్ లను కేటాయించింది. నిధి అగర్వాల్ కెరియర్ నిలబడాలి అంటే ఒక్క ది రాజా సాబ్ సినిమా సక్సెస్ అయితేనే ఈమె కెరియర్ నిలబడుతుందనే విధంగా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో హీరో ప్రభాస్ నటిస్తూ ఉండగా డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ కూడా ఇందులో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది.


ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని స్టైలిష్ గా ఉండబోతుందని ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్లో చూపించారు. ఒకవేళ రాజా సాబ్ సినిమా సక్సెస్ అయితే ఈమెకు మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయి. లేకపోతే మాత్రం సినిమా అవకాశాలు రావడం కష్టమే అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నిధి కెరియర్ మొత్తం ప్రభాస్ సినిమా మీద ఆధారపడిందని చెప్పవచ్చు. నిధి అగర్వాల్ తన తదుపరి చిత్రాల  కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు  వేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: