టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంట గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త మాత్రం మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం, బంధం, కెమిస్ట్రీ గురించి అభిమానులు కూడా తరచూ ఊహాగానాలు చేస్తూ ఉంటారు. రీసెంట్ గా వీరిద్దరూ కలిసి కనిపించిన ఒక ఈవెంట్‌లో జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన “గర్ల్‌ఫ్రెండ్” సినిమా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా రష్మిక నటనకు విమర్శకులు, ప్రేక్షకులు ఇద్దరూ ప్రశంసల వర్షం కురిపించారు. ఒకటిరెండు సినిమాల తర్వాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రాహుల్ రవీంద్రన్‌కి ఈ చిత్రం నిజంగా ఒక బలమైన కంబ్యాక్ అయింది.


ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మేకర్స్ ఇటీవల ఒక గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు. ఆ వేడుకకు ప్రత్యేక అతిథిగా హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఆయన ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచే హాల్లో గోల గోల, చప్పట్లు, కేకలు మొదలయ్యాయి. అభిమానులు ఆయనను చూసి ఉత్సాహంతో కేకలు వేస్తూ స్వాగతించారు. విజయ్ దేవరకొండ అక్కడికి వచ్చే సరికి ముందుగా సీనియర్ నిర్మాత అల్లుఅరవింద్ ను గౌరవంగా పలకరించారు. ఆ తర్వాత ఆయన చూపు పక్కనే కూర్చున్న రష్మిక మందనపై పడింది.విజయ్, రష్మికను చూసిన వెంటనే చిరునవ్వుతో ఆమెవైపు వెళ్లి స్నేహపూర్వకంగా హగ్ చేయబోయాడు. ఆ క్రమంలో ఆమె చేతిని పట్టుకుని, అందరి ముందే సడన్‌గా ఆమె చేతిపై ముద్దు పెట్టాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యంతో, ఆనందంతో కేకలు వేశారు. హాల్లో నిండా చప్పట్లు, అరుపులు మారుమ్రోగాయి. ఆ క్షణం కేవలం కొద్ది సెకన్లే అయినా, అందరి దృష్టినీ ఆకర్షించింది.



ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్లు చాలా రోజులుగా టాలీవుడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం “విజయదశమి సందర్భంగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు” అని కూడా పుకార్లు వచ్చాయి. ఇక “వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి జరుగుతుంది” అనే రూమర్స్ కూడా బాగా హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరూ కలిసి ఈవెంట్‌లో హాజరై, అందరి ముందే ఈ విధంగా క్యూట్ మూమెంట్ షేర్ చేసుకోవడంతో అభిమానులు మాత్రం ఖచ్చితంగా ఇది ప్రేమే అని నమ్మకం పెంచుకున్నారు. రష్మికకు విజయ్ ముద్దు పెట్టిన తర్వాత ఆమె కూడా కొంచెం సిగ్గుతో నవ్వుతూ అతనిని చూసింది. ఆ మధురమైన ఎక్స్ప్రెషన్ ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఊహించలేనంత వేగంగా షేర్ అవుతోంది. అభిమానులు కామెంట్స్‌లో “ఇదే అసలైన కపుల్ గోల్”, “వీళ్లిద్దరి జంటకు బంగారు భవిష్యత్తు ఖాయం”, “ఇది ప్రేమ కాదు అయితే ఇంకేమిటి?” అంటూ ఫన్ మరియు లవ్ ఫిల్డ్ రియాక్షన్స్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: