ఇదంతా పక్కనపెడితే, ఇటీవల సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ వైరల్ అయింది. అందులో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతేకాక, ఆయన ఇప్పటికే డేట్స్ ఇచ్చేశారని, ఆయన రోల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని కూడా ప్రచారం సాగింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఆడియో గ్లింప్స్‌లో వినిపించిన “బ్యాడ్ హ్యాబిట్” సెంటిమెంట్ కూడా చిరంజీవి క్యారెక్టర్‌తో సంబంధముందని అభిమానులు ఊహించుకున్నారు.కానీ, తాజాగా ఒక ప్రముఖ బాలీవుడ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. రిపోర్టర్ చిరంజీవి పాత్ర గురించి ప్రశ్నించగా, ఆయన స్పష్టంగా స్పందిస్తూ—
“స్పిరిట్ సినిమాలో చిరంజీవి గారు ఎలాంటి పాత్రలో నటించడం లేదు. ఇది పూర్తిగా సోషల్ మీడియాలో పుట్టిన రూమర్ మాత్రమే. చిరంజీవి గారితో నేను సినిమా చేస్తే, అది ఒక సోలో యాక్షన్ ఫిల్మ్ అవుతుంది. అలాంటి లెజెండరీ నటుడిని ప్రత్యేక పాత్రలకే పరిమితం చేయను,” అని తెలిపారు. సందీప్ వంగా ఇచ్చిన ఈ సమాధానం మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇప్పుడు కాకపోయినా, భవిష్యత్తులో సందీప్ వంగా - చిరంజీవి కాంబినేషన్లో ఒక పాన్ ఇండియా లెవల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తప్పక వస్తుందనే నమ్మకం ఫ్యాన్స్‌లో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ “చిరు వంగా కాంబో కుదిరితే, బాక్స్ ఆఫీస్ కదలకుండా ఉండదు” అంటూ కామెంత్స్ పెడుతున్నారు.
‘స్పిరిట్’ గురించి ఇప్పటికే ఉన్న హైప్‌కు ఈ క్లారిటీ మరింత చర్చనీయాంశమైంది. ప్రభాస్ మరియు సందీప్ వంగా కాంబినేషన్ నుంచి ఏమి రాబోతోందనే ఆసక్తి పీక్స్‌లో ఉంది. మరోవైపు, చిరంజీవి అభిమానులు ఆయన తదుపరి పాన్ ఇండియా సినిమా కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి