స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు..ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా సినిమా షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కాస్త సమయం దొరికిందంటే చాలు తన కుటుంబంతోనే గడపడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అల్లు అర్జున్. ముఖ్యంగా ఆయన భార్య స్నేహారెడ్డి నిత్య సోషల్ మీడియాలో యాక్టివ్గానే కనిపిస్తోంది. తాజాగా స్నేహ రెడ్డి తన భర్త పైన ఉన్న అపారమైన ప్రేమను తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని షేర్ చేసింది.


ఈ పోస్టులో స్నేహ రెడ్డి ఇలా రాసుకుంటూ..నా భర్త అంటే నాకు చాలా ఇష్టం.. ఆయన అత్యంత గొప్పవారు నేను నిజంగా ఆయనను ప్రేమిస్తున్నాను. ఆయన జీవితంలో ఉండడం నా అదృష్టం, ప్రపంచంలో అత్యంత అదృష్టవంతురాలని నేనే.. నా జీవితంలో జరిగిన అత్యుత్తమైన విషయం కూడా మా ఆయనే.. ప్రతి జన్మలో ఆయన నా భర్తగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ అల్లు స్నేహారెడ్డి ఒక పోస్ట్ షేర్ చేయగా ఈ పోస్ట్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.


అల్లు అర్జున్, స్నేహ రెడ్డిల వివాహం మార్చి 6 ,2011 న హైదరాబాదులో చాలా గ్రాండ్గా జరిగింది. వీరికి అయాన్ అనే కుమారుడు, అర్హ అనే కూతురు కూడా కలదు. నిరంతరం కుటుంబంతో కలిసి అప్పుడప్పుడు వేకేషన్స్ కు వెళ్తూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు అల్లు అర్జున్. తన కుటుంబం గురించి కూడా ఎన్నో సందర్భాలలో సపోర్టు చేసిన విషయాన్ని కూడా తెలియజేశారు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. పుష్ప, పుష్ప 2 చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. మరి తదుపరిచిత్రం ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: