నందమూరి బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2’పై ప్రేక్షకుల్లో ఇప్పటికే అమితమైన క్రేజ్ నెలకొంది. మొదటి భాగం సృష్టించిన స్థాయి హైప్ కారణంగా ఈ సీక్వెల్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి. బోయపాటిబాలయ్య కాంబినేషన్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్.. అఖండ పాత్రకు ఉన్న ఐకానిక్ ఇమేజ్—అన్ని ఈ సినిమాను ఒక భారీ పాన్-ఇండియా మూవీ పై హైప్ పెంచేశాయి. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి దశకు చేరుకోగా, ప్రస్తుతం చివరి వర్క్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘అఖండ 2’ ప్రమోషన్స్‌ను మేకర్స్ వేగవంతం చేశారు. తాజాగా ముంబైలో నిర్వహించిన ‘అఖండ తాండవం’ పాట లాంచ్ ఈవెంట్‌కి సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. తమన్ హాజరై చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.


తమన్ మాట్లాడుతూ—“అఖండ 2 ఫస్ట్ హాఫ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ పూర్తైంది. ఇప్పుడు సెకండ్ హాఫ్ కోసం ఇంకా తీవ్రంగా వర్క్ చేస్తున్నాను. నిజం చెప్పాలంటే, సెకండ్ హాఫ్‌లో ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలి, స్కోర్ ఎక్కడికి తీసుకెళ్లాలి అన్నది అర్థం కాక ఫ్రస్ట్రేషన్‌లో రెండు–మూడు కీబోర్డ్లు పగలగొట్టాను,” అని నవ్వుతూ చెప్పారు.అంతేకాక, “ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ మ్యూజిక్ మరింత ఘనంగా, మరింత ఎనర్జెటిక్‌గా ఉంటుంది. బాలయ్య గారి స్క్రీన్ ప్రెజెన్స్‌కి తగ్గట్టు శక్తి వంతమైన సౌండ్‌ను అందించాల్సిన బాధ్యత నాపై ఉంది,” అని పేర్కొన్నారు.



ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకొని, ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తుందని తమన్ ధీమాగా చెప్పారు. “అఖండ 2 కనీసం 250 కోట్లు సులభంగా దాటుతుంది. బాలయ్య గారి సినిమాలు నాకు కేస్ స్టడీ లాంటివి. ఆయన ఓ డెడికేషన్‌, ఎనర్జీ మ్యూజిక్ టీమ్‌కి కూడా స్పూర్తినిస్తుంది,” అని తెలిపారు.అలాగే బాలయ్యతో తన అనుబంధం గురించి మాట్లాడుతూ—“నా ఫ్యాన్స్‌కి ఈ సినిమాలో కొత్తగా ఏం ఇస్తున్నారు? అని బాలయ్య గారు ప్రతి సినిమాలో నన్ను అడుగుతుంటారు. ఆయన కోసం ప్రత్యేకంగా ఏదో ఇవ్వాలని, ప్రేక్షకులను థియేటర్‌లో షేక్ చేసే సౌండ్ డిజైన్ చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను,” అని చెప్పారు. మొత్తానికి, తమన్ చేసిన కామెంట్స్‌ ‘అఖండ 2’పై ఉన్న అంచనాలను మరింత పెంచేశాయి. బాలయ్యబోయపాటితమన్ కాంబినేషన్ మళ్లీ మాస్ స్టోర్మ్ సృష్టించబోతోందనే నమ్మకం అభిమానుల్లో మరింత బలపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: