టాలీవుడ్ లో సీనియర్ హీరోలలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో బాలయ్య ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా సరికొత్త రికార్డులను సృష్టించాయి. అఖండ, సింహ, లెజెండ్, ప్రస్తుతం అఖండ 2 సినిమా రాబోతోంది. ఇందులో జగపతిబాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సంయుక్త మీనన్ కూడా నటిస్తోంది. తాజాగా అఖండ తాండవం పాటను విడుదల చేసిన మేకర్స్ ముంబైలో ఈ సాంగ్ ను ప్రత్యేకించి మరి ఈవెంట్లో లాంచ్ చేశారు.


ఇందులో భాగంగా బాలయ్య ఈవెంట్ కి వచ్చి అక్కడ పలు విషయాలను తెలిపారు. బాలకృష్ణ మాట్లాడుతూ తాను ఉదయమే 3 గంటలకు లేస్తానని, పూజలు చేయకుండ బయటికి రాను.. అభిమానులతో నాకున్న అనుబంధం ఎప్పుడు కూడా ఎవరు విడదీయలేరని ఆ అనుబంధమే నన్ను హిందూపురం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించేలా చేసిందని తెలిపారు. అఖండ నుంచి తన విజయం మొదలై వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజు సినిమాలతో వరుసగా విజయాలు  అందు అందుకున్నాను.. బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యిందని అంటున్నారు.


ఆ ఈశ్వరుడి కృపతో తాను ముందుకు వెళుతున్నాను, నా డిక్షనరీ లోనే అసలు సెకండ్ ఇన్నింగ్స్ అనేదే లేదని తెలియజేశారు. అఖండ 2 లో సనాతన ధర్మం, హిందూ ధర్మం వంటి అంశాలను ఎక్కువగా చూపించామని.. డైరెక్టర్ బోయపాటితో తనకు హ్యాట్రిక్ సక్సెస్ అనుభవం ఉంది. కానీ మేము ఎక్కువగా మాట్లాడుకోము.. కేవలం ఈ సినిమాని 5 నెలలలోనే పూర్తి చేశామని తెలియజేశారు. గౌతమీపుత్ర శాతకర్ణ సినిమాని ఏకంగా 73 రోజులలోనే పూర్తి చేశాను.. నాకు వేగంగా సినిమాలు చేయడం అంటే చాలా ఇష్టమని, అహలో ప్రసారమవుతున్న అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ కి కొంత బ్రేక్ ఇచ్చాను మళ్లీ తిరిగి మొదలు పెడతానంటూ తెలిపారు బాలయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: