దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో విక్రమ్ కే కుమార్ ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకున్నాడు. ఆఖరుగా విక్రమ్ , నాగ చైతన్య హీరోగా థాంక్యూ అనే సినిమాను రూపొందించాడు. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. ఈ సినిమా తర్వాత నాగ చైతన్య ప్రధాన పాత్రలో విక్రమ్ "దూత" అనే వెబ్ సిరీస్ ను రూపొందించాడు.

ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఈ వెబ్ సిరీస్ వచ్చి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. కానీ విక్రమ్ తన తదుపరి మూవీ ని మాత్రం ఓకే చేసుకోలేదు. గత కొంత కాలం క్రితం విక్రమ్ తన తదుపరి మూవీ ని నితిన్ తో చేయబోతున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అయింది. నితిన్ నటించిన సినిమాలు వరుసగా ఆపజయాలు సాధిస్తూ ఉండడం , అలాగే నితిన్ నటించిన ఆఖరి సినిమా తమ్ముడు కూడా ఫెయిల్యూర్ కావడంతో వీరిద్దరి కాంబో మూవీ క్యాన్సల్ అయినట్లు కూడా కొన్ని వార్తలు వచ్చాయి.

విక్రమ్ తన తదుపరి మూవీ ని మరో యంగ్ హీరోతో ఫిక్స్ చేసుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకున్న పంజా వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత చాలా మూవీ లలో నటించిన ఏ సినిమాతో కూడా విజయాన్ని సొంతం చేసుకోలేదు. పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా విక్రమ్ తన తదుపరి మూవీ ని చేయబోతున్నట్లు , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: