టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. అల్లు అర్జున్ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 మరియు పుష్ప పార్ట్ 2 అనే సినిమాలతో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాడు. ఈ రెండు సినిమాల ద్వారా బన్నీ కి ఇండియా వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం బన్నీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఏకంగా బన్నీ సరసన ముగ్గురు హీరోయిన్లు కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ బృందం వారు దీపికా పదుకొనే సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక మృనాల్ ఠాకూర్ కూడా ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తున్నట్లు , ఈమ పై కొన్ని సన్నివేశాలను కూడా ఈ మూవీ బృందం వారు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అలాగే జాన్వి కపూర్ కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్లో జాయిన్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ఈ సినిమాలో దీపిక పడుకొనే , మృనాల్ ఠాగూర్ , జాన్వి కపూర్ హీరోయిన్లుగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీపై ఓ వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ని వచ్చే సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది. పాన్ ఇండియా సినిమాలలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ ని దసరా పండుగ సందర్భంగా విడుదల చేశారు. ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మరి బన్నీ , అట్లీ కాంబోలో రూపొందుతున్న సినిమా కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: