తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన యువ నటులలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో నటించిన డిజె టిల్లు మూవీ ద్వారా ఈయనకు అద్భుతమైన విజయం , అంతకుమించిన క్రేజ్ దక్కాయి. ఆ తర్వాత ఈయన డీజే టిల్లు మూవీ కి కొనసాగింపుగా రూపొందిన టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా కూడా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఈయన క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ మూవీ తర్వాత సిద్దు "జాక్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ఈయన తాజాగా తెలుసు కదా అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా ఈ సినిమా ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఇప్పటికే ఈ సినిమా బాక్సా ఫీస్ రన్ క్లోజ్ అయింది. మరి ఈ సినిమా మొత్తం ఎన్ని కలెక్షన్లను రాబట్టి , ఎన్ని కోట్ల నష్టాలను మిగిల్చుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 2.65 కోట్ల కలెక్షన్లు దక్కగా , సిడెడ్ లో 60 లక్షలు , ఆంధ్ర లో 2.02 కోట్లు , కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 48 లక్షలు , ఓవర్సీస్ లో 1.72 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 7.47 కోట్ల షేర్ ... 14 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ సినిమా దాదాపు 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ సినిమా ఏకంగా 15.5 కోట్ల రేంజ్ లో నష్టాలను అందుకొని భారీ అపజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: