ఏ భాషలో రిలీజ్ అయిన సినిమాలైనా సరే కేవలం గంటల వ్యవధిలోనే తమ వెబ్సైట్లో పోస్ట్ చేస్తూ భారీగానే సంపాదించారు ఐ బొమ్మ నిర్వాహకులు. అయితే అప్పుడప్పుడు పోలీసులకి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఐ బొమ్మ నిర్వహకులను సైతం పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గడిచిన కొన్ని నెలల పాటు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఈ నిర్వాహకులు కరేబియన్ దీవులలో ఉంటూ తమ వెబ్సైట్ ను నడిపిస్తున్నారు. తాజాగా ఇమ్మడి రవి అనే నిర్వకుడిని కూకట్ పల్లి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.



ఫ్రాన్స్ దేశం నుంచి నిన్నటి రోజున హైదరాబాద్ కి వచ్చిన రవి ఐ బొమ్మ వెబ్సైటు నిర్వహిస్తున్నారని, తన భార్య నుంచి విడాకులు తీసుకొని ప్రస్తుతం ఒంటరిగా ఉన్న రవి అకౌంట్లో రూ .3కోట్ల రూపాయలను పోలీసులు హోల్డ్ లో పెట్టారు. ఐ బొమ్మ వల్ల సినీ పరిశ్రమకు భారీగానే నష్టం జరుగుతోందని ఆరోపణలు వినిపించాయి. ఇప్పటికే వీటి పైన ప్రొడ్యూసర్స్ కూడా ఫిర్యాదులు కూడా చేశారు. ఐ బొమ్మ కింద సుమారుగా 65 మైనర్ వెబ్సైట్లు పనిచేస్తున్నాయని ఫిర్యాదులో తెలియజేశారు.


ముఖ్యంగా సినిమాలు విడుదలైన తరువాత ఐ బొమ్మ తమ ఫ్లాట్ ఫామ్ లో  సినిమాలను ఉంచడం వల్ల సినీ పరిశ్రమకు గత ఏడాది సుమారుగా రూ .3 వేల కోట్ల రూపాయల్లో నష్టం వచ్చిందని వివరించారు. ఐబొమ్మ వీడియోలను cloudflare హోస్టింగ్ సర్వర్ ద్వారా అప్లోడ్ చేస్తున్నారట. విదేశాల నుంచి వీటిని ఆపరేట్ చేస్తూ ఉండడంతో వీటిని ట్రేస్ చేయడం, క్రాస్ చేయడం కూడా చాలా కష్టంగా మారిందని అధికారులు తెలియజేశారు. కేవలం URL ని మారుస్తూ  ఉండడంవల్ల ఐ బొమ్మ సర్వర్ వ్యవస్థాపకుడు దొరకలేదని అధికారులు తెలిపారు. ఐ బొమ్మ దేశవ్యాప్తంగా ఎన్నో దేశాలలో కూడా ఉన్నదని మన ఇండియాలో మాత్రం నెలకు 37 లక్షలు మంది చూస్తున్నారని సైబర్ క్రైమ్ అంచనా వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: