స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె తన అద్భుతమైన నటనతో ఎన్నో సినిమాల విజయాలలో కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. అయితే ఇటీవల దీపికా పదుకొనె ఒక నిబంధన విధించడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే పని చేస్తానని షరతు విధించింది. ఈ కారణంగానే ఆమె ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'కల్కి 2' మరియు 'స్పిరిట్' వంటి భారీ ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నారని వార్తలు వెలువడ్డాయి.
ప్రస్తుతం దీపికా పదుకొనె అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో, అలాగే షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందుతున్న మరొక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలకు మాత్రం ఆమె తన 8 గంటల నిబంధనను కొనసాగిస్తున్నారనే విషయం ఇప్పుడు ప్రభాస్ అభిమానులలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.
సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు దీపికాను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. "షారుఖ్ ఖాన్, బన్నీ సినిమాల కోసం కూడా రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తున్నావా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 'కల్కి 2' మరియు 'స్పిరిట్' వంటి పెద్ద ప్రాజెక్టులకు ఇలాంటి నిబంధన పెట్టడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి, ఇతర పరిశ్రమలలో వర్కౌట్ అయినట్టుగా సినిమా ఇండస్ట్రీలో ఎనిమిది గంటల పని విధానం వర్కౌట్ కాదనేది సినీ ప్రముఖుల అభిప్రాయం. ఇక్కడ ఒక్కో షెడ్యూల్ ఒక్కో విధంగా ఉంటుంది. ఇలాంటి రూల్స్ వల్ల నిర్మాతలకు సైతం కోట్లలో నష్టం వాటిల్లుతుందనే ఆందోళన కూడా ఉంది.
అయితే, కొంతమంది సినీ అభిమానులు మాత్రం దీపికా పదుకొనె కావాలనే ప్రభాస్ సినిమాల నుంచి తప్పుకుందని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం కొసమెరుపు. ఏదేమైనా, ఒక స్టార్ హీరోయిన్ విధించిన ఈ కొత్త పని విధానం ఇప్పుడు సినీ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి