దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన విషయం హీరో రానా దగ్గుబాటిపై నమోదైన మూడు కేసుల గురించే. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, అందమైన నటి భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన తాజా చిత్రం ‘కాంత’ ఈ హడావుడికి కారణమైందని చెప్పుకోవాలి. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషించారు.ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ స్వంత బ్యానర్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి యొక్క ‘స్పిరిట్ మీడియా’ కలిసి నిర్మించాయి. భారీ అంచనాల మధ్య ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు ఈ సినిమా పై సోషల్ మీడియాలోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి హైప్ ఏర్పడింది. అయితే సినిమా విడుదలైన తర్వాత మాత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో బాగానే కలెక్షన్లు రాబట్టినప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించింది. అందులో పాల్గొన్న రానా దగ్గుబాటి, ఈ సినిమా కారణంగా తనపై చెన్నైలో మూడు పోలీస్ కేసులు నమోదు అయ్యాయని సంచలన ప్రకటన చేశారు. ఆయన చెప్పిన ఈ విషయమే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది.

రానా మాట్లాడుతూ—“ఈ సినిమాకు విలువలు చాలా బాగున్నాయని అనేక మంది ప్రశంసిస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్. ఆడియన్స్ నుండి వస్తున్న ఫీడ్బ్యాక్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సినిమా మద్రాస్ నేపథ్యంతో సాగడం వల్ల అక్కడి ప్రేక్షకులు ఇంకా ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్‌కి వెళ్లిన వాళ్లకూ సినిమా నచ్చింది. కానీ ఆశ్చర్యకరంగా, ఇదే సినిమా కారణంగా చెన్నైలో నా మీద మూడు కేసులు నమోదయ్యాయి” అని తెలిపారు. అయితే ఏ విషయంపై కేసులు పెట్టారన్న అసలు కారణం వెల్లడించకపోవడంతో, ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ రానా చెప్పిన ఈ విషయంపై ఊహాగానాలు మొదలయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: