అయితే సినిమాల్లో సక్సెస్ సాధించిన ఈ నటి వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ సెన్సేషన్లకే నిలిచింది. రెండు వివాహాలు, ఇద్దరు ప్రముఖులతో వచ్చిన ఎఫైర్ రూమర్స్… ఇలా ఎప్పుడూ కునిక పేరు చర్చల్లోనే ఉండేది. మొదటి పెళ్లి ఢిల్లీకి చెందిన అభయ్‌తో… రెండో పెళ్లి మిస్టర్ లాల్‌తో జరిగింది. ఇదిలా ఉండగా 80లలో నటుడు ప్రాణ్ కుమారుడు సునీల్ సికంద్‌తో, 90లలో స్టార్ సింగర్ కుమార్ సానుతో ఎఫైర్ నడిపిందని అప్పట్లో బాలీవుడ్‌లో పెద్ద వార్తలే వచ్చాయి.
ఇక తాజాగా కునిక ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్నాయి. ఇప్పటివరకు ఎవరు చెప్పని విషయాన్ని ఆమె బయటపెట్టడంతో బీ–టౌన్‌లో హీట్ పెరిగింది. ముఖ్యంగా అక్షయ్ కుమార్ గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. “అక్షయ్ నా కంటే వయసులో చిన్నవాడు… కానీ ఇప్పటికీ అంత ఫిట్‌గా ఉంటాడు. అక్షయ్‌కి మగతనం చాలా ఎక్కువ. మేల్ హార్మోన్స్ ఎక్కువైతే ఫిట్నెస్ పెరుగుతుంది… అదే అమ్మాయిలకు ఆకర్షణ కలిగిస్తుంది. అక్షయ్ వద్ద ఆ ఆకర్షణ దారుణంగా ఉంటుంది” అని కునిక చెప్పింది. ఇది మాత్రమే కాదు… హీరోయిన్లతో అక్షయ్ కుమార్ ఎఫైర్స్ గురించి కూడా ఆమె ఓపెన్‌గా మాట్లాడింది.
అక్షయ్ కెరీర్ స్టార్ట్‌లో ఎన్నో లవ్ అఫైర్స్ జరిగాయని… అది సహజమేనని కూడా ఆమె వ్యాఖ్యానించింది. కునిక చేసిన ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా బాలీవుడ్‌ను షాక్‌లోకి నెట్టాయి. సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా… అక్షయ్ ఫ్యాన్స్ మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కునిక మాత్రం “నేను నిజం చెప్పాను… దాంట్లో తప్పేముంది?” అనే స్టైల్లో సమాధానమిస్తున్నది. కునిక బాంబ్ వేసిన ఈ కామెంట్స్‌తో బాలీవుడ్‌లో మళ్లీ అక్షయ్ గత ఎఫైర్స్ చర్చ మొదలైపోయింది. ఆమె మాటలు మరికొన్ని రోజులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారడం ఖాయం!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి