నిన్నటి రోజు నుంచి ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్. ఒక కీలకమైన పని కోసం రవి శుక్రవారం (నవంబర్ 14) ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కి వచ్చారు. అనంతరం కూకట్ పల్లిలో ఒక ఫ్లాట్లో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి మరి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే రవి నివాసం నుంచి కొన్ని కీలకమైన హార్డ్ డిస్క్లు ,కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్డి ప్రింట్లకు సంబంధించి కొన్నిటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.



అలాగే ఐ బొమ్మ వెబ్ సర్వర్ నుంచి కూడా సమాచారం సేకరించిన అధికారులు విచారణలో భాగంగా రవి నుంచి పోలీసులు కొన్ని కీలకమైన విషయాలను కూడా తెలుసుకున్నారట. రవి వైజాగ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. తన భార్యతో విభేదాలు ఉండడం వల్ల హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వీరిద్దరి పరస్పర అంగీకారంతో విడాకులకు  సిద్ధమైనట్లు సమాచారం. విడాకుల కోసమే విదేశాలలో ఉన్న రవి హైదరాబాద్ కి వచ్చారని టాక్ వినిపిస్తోంది. అయితే రవి హైదరాబాదుకు వస్తున్నట్లు విషయాన్ని స్వయంగా అతని భార్య సైబర్ క్రైమ్ పోలీసులకు సైతం చెప్పినట్టుగా వినిపిస్తున్నాయి.



రవి భార్య ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు రవి కదలికల పైన కూడా ప్రత్యేకించి మరి నిఘా ఉంచారని, పక్కా ప్లాన్ ప్రకారమే రవిని అరెస్టు చేశారని వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఐ బొమ్మ నిర్వాహకుడు అరెస్ట్ విషయంపై దర్శక ,నిర్మాతల ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నో భాషలలో  విడుదలయ్యే సినిమాలు, ఓటిటి కంటెంట్ విషయంలో పైరసీలు అవుతున్నాయని  టాలీవుడ్ నిర్మాతలు కూడా ఈ పైరసీల పైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసు సీరియస్గా తీసుకున్న అధికారులు ఇప్పుడు ఐ బొమ్మ నిర్వాకుడిని అరెస్టు చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: