ఆ ఎపిసోడ్‌లో నాగార్జున హౌస్‌మేట్స్‌కు “ఈరోజు రెండు బిగ్ బాంబ్స్ పడబోతున్నాయి” అని చెప్పడంతో హౌస్‌లో ఒక్కసారి టెన్షన్ పెరిగింది. మొదటి బాంబ్ — డబుల్ ఎలిమినేషన్ — అప్పుడే బయటపడడంతో అందరి గుండెల్లో గుబులు మొదలైంది. ఇక రెండో బాంబ్ ఎవరి మీద పడుతుందో తెలుసుకోవడానికి నాగ్ ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. ప్రతి కంటెస్టెంట్‌ను —“మీరు ఆడుతున్న గేమ్‌ను ఎక్కువగా సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు?”..“మీ ఆటను కిందకి లాగుతున్న హౌస్‌మేట్ ఎవరు?”..అని అడిగారు. అందరి జవాబుల్లోనూ ఒకే పేరు ఎక్కువ సార్లు వచ్చింది — సంజన. తమ ఆటను డిస్టర్బ్ చేస్తోంది, కిందికి లాగుతోంది అని చాలామంది ఆమె పేరే చెప్పారు. ఇదే కారణంగా రెండో “బిగ్ బాంబ్” కూడా సంజన మీదే పడిందని నాగ్ వెల్లడించారు. కానీ బాంబ్‌లో ఏముందో తెలుసుకోవడానికి బాక్స్ ఓపెన్ చేసినప్పుడు అందరికీ షాక్ ఇచ్చే సర్ప్రైజ్ బయటపడింది—““NO FAMILY WEEK”” అంటే, సంజన ఫ్యామిలీ ఈ వారం హౌస్‌లోకి రారన్న మాట!
ఈ మాట విన్న క్షణం సంజన మానసికంగా పూర్తిగా బ్రేక్ అయింది. రోదిస్తూ, కంపించిపోతూ నాగార్జునతో ఇలా చెప్పింది: “సార్… నేను ఇంటికి వెళ్తాను. ఇక నా వల్ల కాదు. రోజుకు ఆరు సార్లు ఏడుస్తున్నాను. నా పిల్లలను చూడాలి సార్… నేను తట్టుకోలేకపోతున్నాను…” సంజన ఏడుస్తూ నాగ్‌ను రిక్వెస్ట్ చేసినా, నాగార్జున మాత్రం చాలా క్లియర్‌గా, కఠినంగా సమాధానమిచ్చారు: “ఇది నీకు వచ్చిన ఫలితం అమ్మా. ఈ నిర్ణయం మీదవారి చేతుల్లో లేదు. ఇది బిగ్‌బాస్ ఫైనల్ నిర్ణయం.”..కొన్ని సందర్భాల్లో కంటెస్టెంట్స్ తమ అవకాశాన్ని ఇతరులకు ఇవ్వాలని అడిగిన సందర్భాలు ఉన్నప్పటికీ, ఈసారి అలాంటి మార్పులు అస్సలు సాధ్యం కాదని నాగ్ స్పష్టంగా చెప్పారు.
ఈ మొత్తం డ్రామా చూసిన ఆడియన్స్ మాత్రం సోషల్ మీడియాలో కోపంతో పేలిపోతున్నారు. “ఇది రేటింగ్ ప్లాన్ మాత్రమే”, “సంజనను ఉద్దేశపూర్వకంగా బ్రేక్ చేస్తున్నారు”, “బిగ్‌బాస్ ఇంత దిగజారిపోయాడా?” అంటూ ఘాటు కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఎమోషన్స్‌తో మైమరపించిన ఫ్యామిలీ వీక్‌ను ఈసారి మిస్ చేయించడం అచ్చంగా TRP ట్రిక్‌లా కనిపిస్తోందని ప్రేక్షకుల అభిప్రాయం.మొత్తానికి… ఈ ఎపిసోడ్‌లో వచ్చిన ట్విస్ట్ కేవలం హౌస్‌మేట్స్‌కే కాదు, బయట ఉన్న ప్రేక్షకులకూ పెద్ద షాక్ ఇవ్వడం ఖాయం. ఇక ఈ నిర్ణయం తర్వాత సంజన గేమ్‌పై, మానసికంగా ఎలా ప్రభావం పడుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి