టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పౌరాణిక చిత్రాల హవా జోరుగా నడుస్తోంది. ప్రేక్షకులు సైతం చారిత్రక, పౌరాణిక కథాంశాలను ఆదరిస్తున్న నేపథ్యంలో, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక పౌరాణిక చిత్రంలో నటించబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, వారణాసి అనే సినిమాలో మహేష్ బాబు ఏకంగా రాముడి పాత్రలో కనిపించనున్నారనే ఊహాగానం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
ఈ వార్త విన్న అభిమానులు, నెటిజన్లు ఆనందంలో మునిగిపోతున్నారు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో రాముడి పాత్రను పోషిస్తే, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద చరిత్ర తిరగరాయడం పక్కా అని సినీ విశ్లేషకులు, అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము ఎదురుచూస్తున్న మహేష్ బాబు సినిమాకు తగ్గ ఫలితం ఈ వారణాసి చిత్రం రూపంలో ఖచ్చితంగా దక్కుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పౌరాణిక సినిమా వస్తే, రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని, ఇది మహేష్ బాబు కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి, టాలీవుడ్లో ప్రస్తుతం 'వారణాసి' మరియు మహేష్ బాబు కాంబినేషన్ గురించే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు ప్రధానంగా 'రుద్ర' అనే పాత్రలో కనిపిస్తారు. టీజర్, ఫస్ట్ లుక్స్‌లో ఆయన త్రిశూలం ధరించి, నందిపై సవారీ చేస్తున్నట్టుగా కనిపించారు.
దర్శకుడు రాజమౌళి స్వయంగా మాట్లాడుతూ, రామాయణంలోని ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తమ కథకు ఆధారంగా చేసుకున్నామని, రాముడి ఎపిసోడ్‌ను ఏకంగా 60 రోజుల పాటు చిత్రీకరించామని తెలిపారు. మహేష్ బాబును శ్రీరాముడి గెటప్‌లో చూసినప్పుడు తనకు గూస్ బంప్స్ వచ్చాయని రాజమౌళి భావోద్వేగానికి లోనయ్యారు. దివంగత నటుడు కృష్ణ గారి చివరి కోరిక తన కొడుకు పౌరాణిక పాత్ర చేయాలని, ఆ కోరికను ఈ వారణాసి చిత్రంతో తీర్చగలిగానని మహేష్ బాబు కూడా వెల్లడించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి