అలా కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసి మరి కరేబియన్ దీవులను అడ్డాగా మార్చుకొని.. ఐ బొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేసేవారు. అలా ఐబొమ్మ పేరుతోనే సుమారుగా 70కి పైగా మిర్రర్ సైట్లు ఏర్పాటు చేసుకున్నారు.. ఐ బొమ్మ, బప్పం, ఐ రాధ అనే పేరుతో పలు వెబ్సైట్లను కూడా నిర్వహిస్తున్నారట. రవికి దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో నెట్వర్క్ ఉందని, నిర్మాతలు విడుదలకు సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాలను కూడా డిజిటల్ మీడియా సంస్థలతో ఒప్పందాలు ఉన్నాయా అనే కోణంలో పరిశీలిస్తున్నారు.
అంతేకాకుండా కొన్ని సంస్థలు థియేటర్లకు శాటిలైట్ ద్వారా సినిమాలను విడుదల చేస్తున్నప్పుడు వాటిని రవి హ్యాక్ చేస్తున్నారు. వైజాగ్లో MVP కాలనీ 7 లో కూడా నివాసం ఉన్న సమయంలో ఇలాంటి పనులు చేశారట. తనని ఎవరూ కూడా గుర్తించకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవారట రవి. సెప్టెంబర్ 29న జరిగిన అరెస్టులలో తన అనుచరులైన శివాజీ, ప్రశాంత్ అరెస్టు కావడంతో రవి అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటివరకు హైదరాబాదులో ఉన్న రవి విదేశాలకు వెళ్ళిపోయారు. అక్టోబర్ 3 నుంచి నెదర్లాండ్, ఫ్రాన్స్, కరేబియన్ దీవులు ఇలా ఎన్నో దేశాలలో తిరుగుతూ తన ఐపి అడ్రస్సులను మారుస్తూ తిరుగుతున్న ఇమ్మడి రవి.. తన భార్య విడాకుల ప్రాసెస్ కోసం హైదరాబాద్ కి వచ్చిన విషయాన్ని రవి భార్య పోలీసులకు తెలియజేయడంతో రవి కదలికలను గమనించి పోలీసులు పట్టుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి