టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జున ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరోగా నటించడం కంటే కూడా ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలలో నటించడానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన చాలా సినిమాల్లో కీలక పాత్రలలో నటించాడు. కానీ నాగార్జున మాత్రం సోలో హీరోగా మూవీ ఓకే చేయడం లేదు. సోలో హీరోగా నాగార్జున మూవీ చేసి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. నాగార్జున ఆఖరుగా నా సామి రంగ అనే సినిమాలో హీరోగా నటించాడు.

మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. దానితో నాగార్జున అభిమానులు నాగార్జున సోలో హీరోగా సినిమా చేస్తే చూడాలి అని ఎంతో ఆనంద పడుతున్నారు. నాగార్జున చాలా సంవత్సరాల క్రితం శివ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. అమలమూవీ లో హీరోయిన్గా నటించగా ... రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఆ సమయంలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ని తాజాగా భారీ ఎత్తున రీ రిలీజ్ చేసిన విషయం మన అందరికి తెలిసిందే. నాగార్జున సోలో హీరోగా సినిమాలు ఓకే చేయకపోయినా ఆయన హీరోగా రూపొంది బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న శివ మూవీ ని రీ రిలీజ్ చేయనున్నారు అనే వార్త తెలియడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. 

రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు శివ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. మొదటి రోజు ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా 2.5 కోట్ల కనెక్షన్లు వచ్చినట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది. ఇలా ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లు దక్కడంతో నాగార్జున అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: