టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున చాలా సంవత్సరాల క్రితం శివ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. అమలమూవీ లో హీరోయిన్గా నటించగా ... రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాతోనే దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా ద్వారా నాగార్జున , అమల , రామ్ గోపాల్ వర్మ ముగ్గురికి కూడా అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ గుర్తింపు వచ్చింది. ఆ సమయంలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తాజాగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు.

మూవీ రీ రిలీజ్ కి ముందు నాగార్జున , రామ్ గోపాల్ వర్మ పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్లను కూడా నిర్వహించారు. పెద్ద ఎత్తున రీ రిలీజ్ అయిన ఈ సినిమాకు మొదటి రోజు అద్భుతమైన కలక్షన్లు దక్కాయి. మొదటి రోజు ఈ సినిమాకు 2.45 కోట్ల కలెక్షన్లు రీ రిలీజ్ లో భాగంగా దక్కినట్లు తెలుస్తోంది. రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన ఇంపాక్ట్ ను మొదటి రోజు చూపించినట్లు ఈ కలెక్షన్ల ద్వారా స్పష్టంగా అర్థం అవుతుంది.

ఇకపోతే ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలలో ఒకటి అయినటువంటి ఒక్కడు మూవీ కంటే కాస్త కింది స్థానంలో ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా భూమిక హీరోయిన్గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఒక్కడు సినిమాను కొంత కాలం క్రితం రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా 2.54 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇక శివ సినిమా రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు 2.45 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: