గతేడాది థియేటర్లలో విడుదలై హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ అద్భుతమైన విజయానికి సీక్వెల్‌గా జై హనుమాన్ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్టుపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుని పాత్రలో కనిపించనున్నారు. 'కాంతార' వంటి వరుస విజయాలతో రిషబ్ శెట్టి మార్కెట్ విలువ, ఆయనకు ఉన్న క్రేజ్ భారీ స్థాయిలో పెరిగింది. ఆయన నటనకు, దర్శకత్వానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు ఈ పౌరాణిక పాత్రలో ఆయన కనిపించనుండటం సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.
జై హనుమాన్ సినిమా షూటింగ్ 2026 సంవత్సరం జనవరిలో మొదలుకానుంది అని తెలుస్తోంది. రిషబ్ శెట్టి వంటి స్టార్ ప్యాన్ ఇండియా స్థాయిలో అపారమైన ఫాలోయింగ్‌ను కలిగి ఉండటంతో, ఈ జై హనుమాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని సినీ విశ్లేషకులు మరియు ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలై, దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించడం పక్కా అని ధీమా వ్యక్తమవుతోంది. హనుమాన్ సృష్టించిన ప్రభావాన్ని మించి, ఈ సీక్వెల్ మరింత గొప్ప విజయాన్ని సాధిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఈ సినిమాకు రిషబ్ శెట్టి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. రిషబ్ శెట్టి కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి