సినిమా ఇండస్ట్రీ కి సంబంధిం చిన వారంతా సినిమా ఇండస్ట్రీ పైరసీ వల్ల అత్యంత కఠిన పరిస్థితుల్లోకి వెళ్లిపోతుం ది అని , ఈ రోజు ఏదైనా సినిమా విడుదల అయింది అంటే చాలు అదే రోజు ఆ సినిమాకు సంబంధించిన పైరసీ ప్రింటు ఆన్లైన్ లోకి తీసుకువస్తున్నారు అని దాని ద్వారా ప్రేక్షకులు కూడా దానిని చూడడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. దాని వల్ల సినిమా థియేటర్లు మూత పడుతున్నాయి. సినిమాలు వసూలు చేయాల్సిన కలెక్షన్లను వసూలు చేయలేకపోతున్నాయి.

దానితో సినిమా మనుగడ అత్యంత కష్ట పరిస్తుల్లోకి వెళుతుంది అని అలా పైరసీ ద్వారా సినిమాలను ఎవరైతే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారో వారిని కట్టు దిట్టం చేసినట్లయితే సినిమా ఇండస్ట్రీ అద్భుతమైన స్థాయికి వెళుతుంది అని చాలా మంది భావించారు. ఇకపోతే గత కొంత కాలంగా ప్రజలు ఎక్కువ శాతం ఐ బొమ్మ ద్వారా సినిమాలను చూస్తూ వస్తున్నారు. దానితో ఐ బొమ్మ నిర్వాహకుడుని పట్టుకున్నట్లయితే పైరసీ మొత్తాన్ని కట్టు దిట్టం చేయవచ్చు అని పోలీసులు భావించారు. ఇక అనేక కష్ట నష్టాలను ఎదుర్కొని పోలీసులు ఐ బొమ్మ నిర్వాహకుడు అయినటువంటి రవి ని పట్టుకున్నారు.

దానితో ఇకపై పైరేసి ఆగిపోతుంది అని చాలా మంది భావించారు. కానీ ఐ బొమ్మ నిర్వాహకుడు అయినటువంటి రవి ని పట్టుకున్న కూడా పైరసీ ఏ మాత్రం ఆగలేదు. గతవారం విడుదల అయిన చాలా సినిమాలు విడుదల అయిన తక్కువ కాలం లోనే అనేక పైరసీ వెబ్ సెట్స్ లోకి అందుబాటు లోకి వచ్చాయి. దానితో ఐ బొమ్మ రవి ని అరెస్టు చేసిన కూడా పైరసీ ని కట్టుది ట్టం చేయలేకపోవడం తో పోలీసులు మొత్తం గా పైరసీ ని కట్టడి చేసే వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: