చాహల్ ఎంట్రీతో వేడుకలో ఎనర్జీ మరింత రెట్టింపైంది. హరిణ్య, రాహుల్‌తో కలిసి చాహల్ స్టేజ్‌పై సరదాగా డ్యాన్సులు చేయడం, ఫోటోలు దిగడం… మొత్తం వేడుకని ఒక సెలబ్రిటీ ఈవెంట్‌లా మార్చేసింది. ఈ సర్ప్రైజ్ చూసి ఆనందంతో మురిసిపోయిన హరిణ్య, చాహల్‌తో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.‘‘ఈ సర్ప్రైజ్ నిజంగా నా జీవితంలో మరపురాని క్షణం. ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినందుకు రాహుల్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చాహల్‌కు పెద్ద వీరాభిమానిని. ఆయన మన సంగీత్ వేడుకకు వస్తారని నేను ఊహించనేలేదు. ఈ క్షణాన్ని నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను’’ అని హరిణ్య ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు.
చాహల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఆమె పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇక నవంబర్ 27న జరగబోయే రాహుల్–హరిణ్య వివాహంపై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. సంగీత్ వేడుక ఇలా గ్రాండ్ అయ్యినప్పుడు అసలు పెళ్లి ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి