ఐ బొమ్మ నిర్వాహకుడు  రవి పోలీసులకు పట్టుబడ్డ విషయం అందరికీ తెలిసిందే. గత ఐదు రోజుల నుంచి ఆయనను విచారించినటువంటి  పోలీసులు చాలా విషయాల పై ప్రశ్నించారు.  ఐ బొమ్మ సంస్థను ఏ విధంగా నడిపాడు, ఎలాంటి పేమెంట్స్ తీసుకున్నాడు, ఎవరికి దొరకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు అనే దానిపై ఆరా తీశారు. కట్ చేస్తే రవి ఇన్నాళ్లు పోలీసులకు చుక్కలు చూపించారు. కానీ తన సొంత భార్య, స్నేహితుడి వల్లే పోలీసులకు దొరికిపోయాడు. అయితే రవి తన భార్యని ఎందుకు వదిలిపెట్టాడు. ఆమె పోలీసులకు ఎందుకు సమాచారం ఇచ్చింది అనే వివరాలు చూద్దాం.. 

అయితే తాను సంపాదించడం లేదని తన భార్య తరచూ వేధించేదని రవి పోలీసుల విచారణ లో చెప్పుకొచ్చారు. కానీ దీనికి రివర్స్ గా తన భార్య రవిపై ఆరోపణలు చేస్తోంది. రవి తాను సంపాదించిన డబ్బుతో కూకట్పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీ లో ఒక ఇల్లు కొన్నాడు. దానికి సంబంధించిన వాయిదాలు కూడా రెండు సంవత్సరాలలో తీర్చేశాడు. డబ్బు ఎప్పుడైతే తన చేతిలోకి వచ్చిందో అప్పటినుంచి నన్ను దూరం పెట్టాడని భార్య చెప్పుకొచ్చింది. మా కూతురు ఎనిమిది నెలల పసికందు.. అది కూడా పట్టించుకోకుండా రవి ఆమెను కొట్టేవాడంటూ విదేశాల నుంచి రవి భార్య ఫోన్ చేసి పోలీసులకు చెప్పింది.

తన ప్రవర్తన నచ్చకపోవడం వల్లే నేను విడాకులు తీసుకున్నానని ఆమె తెలియజేసింది. అంతే కాదు విడాకుల సమయంలో కూడా రవి నాకు నా కూతురుకు ఆస్తిలో ఎలాంటి వాటా ఇవ్వనని చెప్పి ఒక ఒప్పంద పత్రం కూడా రాయించుకున్నాడని తెలియజేసింది. నేను అన్నింటిపై సంతకం పెట్టిన తర్వాతే విడాకులు ఇచ్చాడని  చెప్పుకొచ్చింది. ఈ విధంగా భార్యను వేధించి చిత్రహింసలు పెట్టడం వల్లే ఆయన హైదరాబాదుకు వస్తున్నాడని తెలిసి ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: