సాధారణంగా సినిమా ఇండస్ట్రీ వారు కానీ ఇంకా ఎవరైనా ప్రముఖులు చనిపోతే వారి యొక్క భౌతిక కాయాలను ఫ్యాన్స్, ప్రముఖుల సందర్శన కోసం  ఇంటి వద్ద లేదంటే ఏదైనా ప్రత్యేకమైన గ్రౌండ్లలో ఏర్పాట్లు చేసి ఉంచుతారు. అలా అందరూ సందర్శించుకొని నివాళులర్పించిన తర్వాత వారికి దహన సంస్కారాలు చేస్తారు. కానీ హిందీ ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించి మూడు తరాల నటులతో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నటువంటి  నటుడు ధర్మేంద్ర అంత్యక్రియలు మాత్రం చాలా డిఫరెంట్ గా జరిగాయి.  దీంతో పలువురు ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అధికారికంగా జరపాల్సినటువంటి అంత్యక్రియలను ఇలా ఆగమాగం ఎందుకు జరిపారు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. ఎక్స్ వేదికగా కరణ్ జోహార్ ధర్మేంద్ర చనిపోయిన విషయాన్ని స్పష్టం చేశారు.. 

అయితే ధర్మేంద్ర మృతదేహాన్ని ఇంటి దగ్గర ఫ్యాన్స్ ఇతర ప్రముఖుల సందర్శనార్థం ఉంచకుండా ముంబైలోని పవన్ హాన్స్ స్మశాన వాటికకు డైరెక్ట్ గా తీసుకెళ్లారు. ఇదే సమయంలో ధర్మేంద్ర భార్య హేమమాలిని కూతురు ఈషా డియోల్ సైతం ముంబైలోని పవన్ హన్స్ స్మశాన వాటికకు తెలుపు రంగు దుస్తుల్లో రావడం  అందరికీ తెలిసిందే. అయితే హఠాత్తుగా ముంబైలోని పవన్ హాన్స్ స్మశాన వాటికకు భద్రత కూడా పెంచేశారు. అంతేకాదు నేరుగా స్మశాన వాటికకు అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్,అమీర్ ఖాన్ వంటి ఎంతో మంది ప్రముఖులు వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 2025 నవంబర్ 24 వ తేదీన ముంబైలోని ధర్మేంద్ర ఇంటి నుంచి ఒక అంబులెన్స్ బయటకు రావడంతో ధర్మేంద్ర ఆరోగ్యం క్షీణించిందని  అందరూ భావించారు.

అలా కొంతసేపటికి ఆయన మరణించారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ధర్మేంద్ర చనిపోయిన తర్వాత ఆయన ఇంటికి ప్రముఖులు వెళ్లినట్టు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. నేరుగా ఎంతో మంది నటులు స్మశాన వాటికలో వెళ్లిన విజువల్స్ మాత్రమే అందరికీ కనిపించాయి. దీంతో చాలామంది ఆయన భౌతిక కాయాన్ని ఎందుకు అంత హఠాత్తుగా స్మశాన వాటికకు తీసుకెళ్లారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు వారి కుటుంబం  ఇంత స్పీడుగా ఆయన అంత్యక్రియలు నిర్వహించడం వెనక ఆంతర్యం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి చూడాలి దీనికి సంబంధించి వారి కుటుంబం స్పందిస్తుందా లేదా అనేది త్వరలో బయటకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: