ఐ బొమ్మ రవి ప్రస్తుతం మీడియాలో చర్చల్లో ఉన్న పేరు.. ఈయన కొన్నాళ్లపాటు ఐ బొమ్మ సైట్ ద్వారా సినిమాలను పైరసీ చేసి అందులో ప్రదర్శింపజేశాడు. అలా సినిమా ఇండస్ట్రీ వాళ్లకు చుక్కలు చూపించి ఎంతోమంది పేద వాళ్లకు సినిమా అందించిన ఐ బొమ్మ రవి రీసెంట్ గా అరెస్టు అయ్యారు. ఇదే తరుణంలో ఐ బొమ్మ రవి తండ్రి అప్పారావు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.. తన కొడుకు చేసిన పనిని నేను సమర్థించను.నా కొడుకు తప్పే చేశాడు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఆయన చేసిన తప్పుకు చట్టం శిక్షిస్తుంది. కానీ ఇండస్ట్రీలోని కొంతమంది వ్యక్తులు నా కొడుకుని ఎన్కౌంటర్ చేయాలని అంటున్నారు. కానీ దాన్ని నేను సమర్థించను.. సినిమా ఇండస్ట్రీ కొంతమంది చేతుల్లోనే ఉందని, వారి వల్లే ఇలాంటి వ్యక్తులు బయటకు వస్తున్నారని తెలియజేశారు.. 

కొత్తవారికి అవకాశం ఇస్తే సినిమా ఇండస్ట్రీలో చాలా బాగుంటుందని, అసలు మెగా ఫ్యామిలీ నుంచి పూర్తిగా హీరోలంతా ఇండస్ట్రీని ఏలుతూ ఉన్నారని అన్నారు. ఆ హీరోల కంటే అందమైన వ్యక్తులు,టాలెంట్ ఉన్నవారు బయట ఉన్నారని, కానీ వారికి అవకాశాలు రాకుండా చేస్తున్నారంటూ చెప్పుకోచ్చారు. ఇండస్ట్రీలో ఆ పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీస్తే వేలకోట్ల బడ్జెట్ అవుతుందని, ఆ డబ్బులు మళ్ళీ సంపాదించడానికి సాధారణ జనాలపై టికెట్లు రేట్లు పెట్టి రుద్దుతున్నారని తెలియజేశారు. అదే కొత్తవారికి అవకాశం ఇస్తే టికెట్ రేట్లు తక్కువ అవుతాయి.సినిమా చూసిన ఫీలింగ్ కూడా అందరికీ కలుగుతుందని తెలియజేశారు. మెగా ఫ్యామిలీ హీరోలంతా ఆకాశం నుంచి ఊడి పడ్డారా అంటూ ప్రశ్నించారు. వారి కంటే అందమైన వ్యక్తులు బయట ఉన్నారని వారికి అవకాశాలు ఇవ్వాలని చెప్పుకోచ్చారు.

అల్లు రామలింగయ్య వల్లే చిరంజీవి ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యి ముందుకు వెళ్లారని అన్నారు. ఆ తర్వాత చిరంజీవి తన తమ్ముళ్ళను ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చారని అలా ఒక్కొక్కరిగా ఆ ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీలోకి వచ్చారని అన్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో సినిమాలు తీసుకొని వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే వారిని అప్పారావు ఏకీపారేశారు. మీరంతా పక్కకు జరిగితే కొత్త హీరోలు వస్తారు.సినిమా టికెట్ రేట్ కూడా తక్కువ ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ విధంగా అప్పారావు మాట్లాడడంతో మెయిన్ మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో చాలామంది అప్పారావుకు సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కానీ మెగా అభిమానులు మాత్రం విమర్శిస్తూ వస్తున్నారు. మరి అప్పారావు మాటలపై మీ కామెంట్ ఏంటో కూడా చెప్పండి.

మరింత సమాచారం తెలుసుకోండి: