సాధారణంగా ఇటీవలి పెద్ద సినిమాల ప్రీమియర్స్‌కి భారీగా టికెట్ ధరలు పెంచడం ట్రెండ్ అయిపోయింది. కానీ ‘అఖండ 2’ టీమ్ మాత్రం ఆ రూట్ ఫాలో కాకుండా, ప్రేక్షకుల బడ్జెట్‌కి ఓ భారంగా లేకుండా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా మీడియం రేంజ్ టికెట్ ధరలనే నిర్ణయించబోతున్నట్టు స్పష్టం చేసింది.ఇది బాలయ్య అభిమానులకే కాదు, సాధారణ సినీప్రియులకూ హృదయపూర్వకంగా నచ్చే నిర్ణయంగా మారింది. బాలయ్య సామాన్య ప్రేక్షకుడి పట్ల ఉన్న ప్రేమ, సోషల్ సెన్సిబిలిటీని ఈ నిర్ణయం మరోసారి నిరూపించిందనే చెప్పాలి.
ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ అందిస్తున్న సంగీతం ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉంది. విశాల్‌లాంటి భారీ స్కేల్ టెక్నికల్ టీం, విజువల్ గ్రాండియర్‌తో కూడిన యాక్షన్ ఎపిక్‌గా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ వారు నిర్మిస్తున్నారు. పైగా ఈ సారి సినిమా పూర్తిగా పాన్ ఇండియా లెవెల్లో భారీగా రిలీజ్ కాబోతుండటంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మొత్తానికి, ‘అఖండ 2’ విడుదలకు ముందే బాలయ్య, బోయపాటి తీసుకున్న ఈ టికెట్ ధరల నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రేక్షకుల కోసం ఇంత బెటర్ ప్లానింగ్ చేసిన మేకర్స్‌కి అభిమానులు భారీగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి