నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి , ఎన్నో విజయాలను అందుకున్నాడు. బాలకృష్ణ తన కెరియర్ ప్రారంభం నుండి కూడా ఎక్కువ శాతం అద్భుతమైన మాస్ సినిమాల్లో నటించడానికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తూ వస్తున్నాడు. దానితో బాలకృష్ణ ఇప్పటివరకు ఎన్నో మాస్ సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఇకపోతే ఆయన అభిమానులు కూడా ఎక్కువ శాతం బాలకృష్ణ మాస్ సినిమాలు చేస్తేనే బాగుంటుంది అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తుంటారు. ఈ మధ్య కాలంలో కూడా బాలయ్య పెద్దగా ప్రయోగాలు ఏమీ చేయకుండా తనకు ఎంతగానో కలిసి వచ్చిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలలోని నటిస్తూ వస్తున్నాడు. వాటితోనే వరుస విజయాలను అందుకుంటున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం బాలయ్య "అఖండ" అనే సినిమాలో హీరో గా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. బోయపాటి శ్రీను తాజాగా బాలకృష్ణ హీరోగా అఖండ 2 అనే సినిమాను రూపొందించాడు. 

సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీని విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడతల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి జాజి కాయ జాజి కాయ అంటూ సాగే మాస్ బిట్ సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్లో బాలయ్య మరియు సంయుక్త మీనన్  ఆడి పాడారు. ఇక బాలయ్య మాస్ పాటలో పర్ఫార్మ్ చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ సాంగ్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ జనాలను లభిస్తుంది. ఇప్పటికే ఈ సాంగ్ కి యూట్యూబ్ లో 10 మిలియన్ ప్లేస్ వ్యూస్  వచ్చినట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: