టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన చాలా సంవత్సరాల క్రితం కెరియర్ను మొదలు పెట్టి ఎన్నో విజయాలను అందుకొని అద్భుతమైన స్థాయిలో కెరీర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపొతే ప్రస్తుతం తారక్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం అంతా బాగున్నా ఓ విషయంలో మాత్రం తారక్ ఫ్యాన్స్ తెగ డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది. తారక్ కొంత కాలం క్రితం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ ఈ మూవీ మంచి కలెక్షన్లను మాత్రం బాక్సా ఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ కి కొనసాగింపుగా రెండవ భాగం ఉండబోతుంది అని ఈ మూవీ బృందం వారు మొదట ప్రకటించారు.

కానీ ఆ తర్వాత ఈ సినిమాకు రెండవ భాగం ఉండదు అని చాలా వార్తలు వైరల్ అయ్యాయి. అలాంటి సమయంలోనే తారక్ స్వయంగా దేవర పార్ట్ 2 మూవీ ఉంటుంది అని , మరి కొన్ని రోజుల్లోనే ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది అని ప్రకటించాడు. ఇక ఆ తర్వాత మళ్లీ దేవర పార్ట్ 2 మూవీ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. ప్రస్తుతం మళ్ళీ దేవర పార్ట్ 2 మూవీ ఉండే అవకాశాలు లేవు అని వార్తలు వస్తున్నాయి. దీనితో అసలు దేవర పార్ట్ 2 మూవీ ఉంటుందా ..? లేదా ..? అనే దానిపై పక్కా క్లారిటీ తారక్ నుండి వస్తే బాగుంటుంది అని ఆయన అభిమానులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దేవర పార్ట్ 1 మూవీ లో తారక్ రెండు పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా  ... సైఫ్ ఆలీ ఖాన్ ఈ మూవీ  లో విలన్ పాత్రలో నటించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: