దక్షిణ భారత సినిమా ఇండస్ట్రీలో సింపుల్‌గా, డిసెంట్‌గా కనిపించే హీరోల్లో ధనుష్ పేరు ముందుంటుంది. వైట్ అండ్ వైట్ లుంగీ, సాదాసీదా షర్ట్, సింపుల్ హెయిర్ స్టైల్—ఇలా అతను కనిపించడం వల్ల చాలామంది అతడిని ‘సాదాసీదా వ్యక్తి’గా భావిస్తుంటారు. అయితే అతని వ్యక్తిగత అభిరుచులు మాత్రం ఆ సింపుల్ లుక్‌కు పూర్తి భిన్నంగా ఉంటాయన్న విషయం ఇటీవల బయటపడింది. ముఖ్యంగా అతని లగ్జరీ వాచ్‌లపై ఉన్న అద్భుతమైన పిచ్చి గురించి ఇప్పటివరకు ఎవరికీ పెద్దగా తెలియలేదు. ఇటీవల ధనుష్ దుబాయ్‌లో నిర్వహించిన వాచ్ వీక్ 2025 కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యాడు. అక్కడ మీడియాతో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యాంకర్ అతడి చేయిలో కనిపిస్తున్న వాచ్ గురించి ఆసక్తిగా ప్రశ్నించాడు. “మీ చేతికి ఉన్న వాచ్ విలువ సుమారు రూ. 2.5 కోట్లు అన్న మాట నిజమేనా?” అని అడగగా, ధనుష్ చిరునవ్వు నవ్వి స్పందించకుండా ఊరుకున్నాడు. అతని ఆ స్మైల్ చూసి ఆ విలువ నిజమేనని అందరూ అర్థం చేసుకున్నారు.


అయితే అసలు షాక్ ఇచ్చిన విషయం అక్కడి తరువాత బయటపడింది. ధనుష్ దగ్గరున్న వాచ్‌లలో అది కేవలం చిన్న భాగం మాత్రమే అని తెలిసింది. ఆ వాచ్ కంటే ఎన్నో రెట్లు ఖరీదైన నేషనల్, ఇంటర్నేషనల్, రేర్ ఎడిషన్, లిమిటెడ్ కలెక్షన్ పీస్‌లు అతడి దగ్గర ఉన్నాయని, అవి ఒక్కోటి కోట్ల విలువ ఉండేలా సేకరించాడని సమాచారం బయటకు వచ్చింది. ధనుష్ కూడా ఈ విషయాన్ని ఇటీవల ఇచ్చిన మరో చిట్‌చాట్‌లో అంగీకరిస్తూ— “నాకు వాచ్‌లంటే అమితమైన ఇష్టం. వాచ్ అనేది కేవలం టైమ్ చెప్పే పరికరం కాదు… ఒక కళ. ఒక కథ. ప్రతి వాచ్‌కు దాని స్వంత హిస్టరీ ఉంటుంది. నేను వాటిని శ్రద్ధగా సేకరిస్తూ వస్తున్నాను,” అని చెప్పినట్లు తెలుస్తుంది.



ఇంతవరకు బయటికొచ్చని అతడి ఓ టాప్ సీక్రెట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం—ధనుష్ దగ్గర ఉన్న మొత్తం వాచ్ కలెక్షన్ విలువ రూ. 60 కోట్లు దాటుతుందట! ఇదివరకు ఎవరూ ఊహించని  విషయం. ధనుష్ ఫ్యాన్స్ నవ్వుతూ— “ఈ మొత్తం విలువ బయటికి వస్తే జనాలు షాక్ అయ్యే అవకాశమే ఎక్కువ. గుండె ఆగిపోతుందేమో కూడా!” అంటూ హాస్యంగా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం తేరి ఇష్క్ మే త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కు ‘అమర కావ్యం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: