టాలీవుడ్‌లో స్టార్ హీరోల ఫ్యానిజం అంటే ఎప్పటినుండో ఒక హీట్‌ఫుల్ టాపిక్‌గానే ఉంది. ఎవరి హీరో గురించే మాట్లాడిన వారి ఫ్యాన్స్ ఆ హీరోను ఆకాశానికెత్తి పొగడటం, మరింతగా ఎవరు వారి హీరోపై కామెంట్ చేస్తే తూటాల యుద్ధమే మొదలుపెట్టేయడం—ఇది సోషల్ మీడియాలో కామన్ సీన్. మాటలతోనే ఆగిపోయే ఫ్యాన్స్ ఒక వైపు ఉంటే, ఏదైనా చిన్న విషయానికే రెచ్చిపోయి బూతులు, బెదిరింపులు, వాదనలు చేసేవాళ్లు మరో వైపు ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఫ్యానిజం కొత్త లెవెల్‌కి వెళ్లిపోయింది. ఎవరూ ఊహించని విధంగా సోషల్ మీడియా రెండు పెద్ద సినిమాలు వారణాసి వ్శ్ స్పిరిట్ అనే కొత్త వార్‌కు వేదిక అయింది. ఈ రెండు సినిమాల మీద వచ్చిన ఒక్కో అప్‌డేట్‌తోనూ ఇంటర్నెట్‌లో ఘాటు డిబేట్లు, పోల్స్, ఫ్యాన్స్ వార్—ఇవన్నీ పీక్‌కి వెళ్లిపోయాయి.


స్పిరిట్ పూజా కార్యక్రమాలు – సోషల్ మీడియాను హీట్ చేసిన మువ్మెంట్ :

కొన్ని రోజుల క్రితమే సందీప్ రెడ్డి వంగా–ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్‌గా జరిగాయి. ఈ ఈవెంట్‌కి సంబంధించిన ఫొటోలు బయటికి రాగానే నిమిషాల్లో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరుకావడం స్పిరిట్‌కి మరింత హైప్ తెచ్చింది. ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ అసలు మూడ్‌లోకి వచ్చేసి సోషల్ మీడియాలో ఫుల్ స్పీడ్‌లో సినిమా హైప్ పెంచడం మొదలుపెట్టారు.



ఇక మరో వైపు… రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో వస్తున్న ‘వారణాసి’ సినిమా గ్లింప్స్ ఇటీవలే రిలీజ్ కావడం ఇంకా హీట్ పెంచేసింది. వారణాసి పేరు వినగానే రాజమౌళి సినిమాల విషయంలో ఉన్న అంచనాలు అన్నీ మరో స్థాయిలోకి వెళ్తాయి. కారణం కూడా ఉంది—ప్రతి సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ఆయనకు నిబంధనలా మారిపోయింది. అందుకే వారణాసి అప్‌డేట్ వచ్చిందంటే ఒక్కమాట—సోషల్ మీడియాలో ట్రెండ్ కచ్చితమే! ఇదిలా ఉండగా… కొత్తగా హైలెట్ అయిన పోల్స్ గురించి ఇప్పుడు అందరు మాట్లాడుకుంటున్నారు. “ఏ సినిమా ఇండస్ట్రీ చరిత్ర తిరగరాస్తుంది..? వారణాసి లేదా స్పిరిట్?” అక్కడినుంచే అసలు ఫ్యాన్స్ వార్ మొదలైంది. ప్రతి హీరో ఫ్యాన్ తన హీరో సినిమా అని పొగిడుతున్నాడు . వంగ వర్సెస్ రాజమౌళి, ప్రభాస్ వర్సెస్ మహేష్—ఇలా పోలికలు మొదలయ్యాయి.



కానీ కామన్ పీపుల్ మాత్రం ఫ్యాన్స్‌పై సెటైర్లు చేస్తూ, “బాబోయ్.. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే సినిమాలు వస్తాయి, కొట్టుకోకండి, చావకండి” అంటూ ఘాటు రియాక్షన్లు ఇస్తున్నారు. మెగాస్టార్ పాల్గొనడం స్పిరిట్‌కి అదిరిపోయే హైప్ ఇచ్చింది. మరో వైపు వారణాసి రాజమౌళి సినిమా కావడంతో అంచనాలు ఆకాశమే హద్దుగా ఉన్నాయి. ఈ రెండింటి ఫ్యాన్స్ మధ్య పోలికలు పడుతుండడంతో సోషల్ మీడియా ట్రెండ్ పూర్తిగా హీట్ అయిపోయింది. ప్రతి అప్‌డేట్‌కీ ఫ్యాన్స్ ఒక్కరంటే మరోకరు కొట్టేసే రేంజ్‌లో వాదనలు చేస్తున్నారు. మొత్తానికి…వారణాసి వ్శ్ స్పిరిట్ వార్ ప్రస్తుతం టాలీవుడ్ ఫ్యానిజంలో హాట్ టాపిక్.“కంటెంట్ బాగుంటే సినిమా హిట్టవుతుంది. ఫ్యాన్స్ మీరు మాత్రం శాంతించండి!” అంటూన్నారు కామన్ పీపుల్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: