ప్రస్తుత కాలంలో ఒక సినిమాను రూపొందించడానికి ఎంత భారీ బడ్జెట్ అవసరమో, ఆ సినిమాను ప్రేక్షకులకు చేరవేయడానికి – అంటే పబ్లిసిటీ కోసం – దాదాపు అంతే ఖర్చు అవుతుంది. ముఖ్యంగా పెద్ద సినిమాల విషయానికి వస్తే, ప్రమోషన్స్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం  అనేది ఇప్పుడు సాధారణం అయిపోయింది. టీజర్లు, ట్రైలర్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా క్యాంపెన్లు – ఇలా ప్రతి దశలో కూడా భారీగా ఖర్చు పెట్టాల్సిందే. కానీ అదే సమయంలో, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గురించి ప్రజలు చెప్పుకునే మాట ఒక్కటే – “అతనికి ఒక రూపాయి ఖర్చు పెట్టకుండానే నోటి మాటతో కోట్ల రూపాయల పబ్లిసిటీ రాబట్టే సామర్థ్యం ఉంది.” ఇది కొంతమంది వ్యంగ్యంగా చెప్పినా, చాలామంది మాత్రం ఇది నిజంగానే రాజమౌళి టాలెంట్ అంటున్నారు. ఎందుకంటే ఆయన కెరీర్ మొత్తం చూస్తే, రూపొందించిన ప్రతీ సినిమా కూడా ఆరంభం నుండి విడుదల వరకు ఒక తీరని హడావిడితో, ఓ ప్రత్యేకమైన పబ్లిసిటీ వేవ్‌తో ముందుకు సాగింది.


రాజమౌళి అంటే కేవలం సినిమాను డైరెక్ట్ చేసే వ్యక్తి మాత్రమే కాదు. సినిమాను ఎలా ప్రజలకు చేరవేయాలో, ఎలాంటి మాటలు, ఎలాంటి కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయో అద్భుతంగా తెలిసిన వ్యక్తి. అందుకే ఆయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా కూడా — చిన్నదైనా పెద్దదైనా — స్థాయికి మించి బజ్‌ను సృష్టిస్తూ వచ్చింది. ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆయన తలపెట్టిన సినిమాల్లో ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు. ఈ విషయమే ఆయన ప్రమోషన్ స్ట్రాటజీ ఎంత బలంగా పనిచేస్తుందో స్పష్టంగా చెబుతుంది.



ఈ నేపథ్యంలో, రాజమౌళి ఇటీవల వారణాసి సినిమా ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు మరొక్కసారి ఇండస్ట్రీ అంతా చర్చించుకునేలా చేశాయి. గ్లింప్స్ వీడియో గురించి మాట్లాడుతుండగా, ఆయన భావోద్వేగాలకు లోనై, “దేవుడు నిజంగా ఉన్నాడా?”, అంటూ హనుమంతుడిపై తన నమ్మకాలు, భావాలు గురించి ఓపెన్‌గా స్పందించారు. ఆ మాటలు ఎంతో భావోద్వేగంతో వచ్చినా, సోషల్ మీడియాలో మాత్రం అవి చర్చకు గురయ్యాయి. ఒక్కసారిగా ఇండస్ట్రీ, అభిమానులు, విమర్శకులు – అందరూ ఈ వ్యాఖ్యలను రియాక్ట్ చేయడం ప్రారంభించారు. దీని వల్ల సినిమాకి హ్యూజ్ పబ్లిసిటీ వచ్చింది. ఆయన ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: