నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పటి నుంచో ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్న చారిత్రక ప్రాజెక్ట్ 'ఆదిత్య 999'. దీనికి కారణాలు రెండు. ఒకటి – ఇది కల్ట్ క్లాసిక్ 'ఆదిత్య 369'కి సీక్వెల్ కావడం. రెండు – ఈ సినిమా ద్వారా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం చేయబోతున్నాడనే వార్త! ఈ రెండు కోరికలు ఒకేసారి తీరుతాయని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్న వేళ... ప్రాజెక్ట్‌లో భారీ ట్విస్ట్ జరిగింది! నమ్మకంపై వేటు: క్రిష్ ఎగ్జిట్! .. 'ఆదిత్య 999' ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే బాధ్యతను మొదట్లో బాలకృష్ణ తన అత్యంత నమ్మకస్తుడైన దర్శకుడు క్రిష్ జాగర్లమూడికి అప్పగించినట్లు ప్రచారం జరిగింది. గతంలో 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' లాంటి బ్లాక్ బస్టర్ అందించిన క్రిష్‌పై బాలయ్యకు అపారమైన నమ్మకం ఉంది.


 అందుకే, క్రిష్ స్క్రిప్ట్ పనులన్నీ మొదలుపెట్టారని వార్తలు వచ్చాయి. ఇటీవల బాలయ్య కూడా 'ఆదిత్య 999' ఖచ్చితంగా ఉంటుందని ప్రకటించి ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుష్ చేశారు. కానీ ఇప్పుడు ఇన్ సైడ్ వర్గాల నుంచి వస్తున్న వార్త అభిమానులకు బిగ్ షాక్ ఇస్తోంది. తన ఇతర కమిట్‌మెంట్స్ (ఇతర క‌మిట్‌మెంట్స్) కారణంగా క్రిష్ ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నారట! తన ఇబ్బందులను బాలయ్యకు విన్నవించుకుని, ఈ ప్రాజెక్ట్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ఎవ‌రు? బాలయ్య ప్లానింగ్ వర్కవుట్ అవుతుందా? .. క్రిష్ తప్పుకోవడంతో ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న మొదలైంది: 'ఆదిత్య 999'కి ద‌ర్శ‌కుడు ఎవ‌రు?



బాలయ్య పక్కా ప్లానింగ్‌లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యేలోగా, ఆదిత్య 999 స్క్రిప్ట్ పనులు కూడా కంప్లీట్ చేసి, వీలైనంత త్వరగా రెండు ప్రాజెక్టులనూ ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లాలని బాలకృష్ణ భావించారు. కానీ క్రిష్ వైదొలగడంతో, ఈ ప్లానింగ్ మొత్తం అయోమయంలో పడింది. ప్రస్తుతం టాప్ డైరెక్టర్లంతా తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి బాలయ్య మాటకు కాదనకుండా... ఈ చారిత్రక ప్రాజెక్ట్‌ను భుజానకెత్తుకునే పవర్‌ఫుల్ దర్శకుడు ఎవరో తెలియాలంటే, మరికొంత కాలం వేచి చూడక తప్పదు!

మరింత సమాచారం తెలుసుకోండి: