మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య కాలంలో చాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏ మూవీ తో కూడా రవితేజ కు మంచి విజయం దక్కలేదు. ఆఖరిగా రవితేజ కు ధమాకా అనే సినిమాతో విజయం దక్కింది. ఈ సినిమా తర్వాత రవితేజ కు విజయం దక్కలేదు. తాజాగా రవితేజ "మాస్ జాతర" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం రవితేజ , కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

రవితేజ ఈ సినిమా తర్వాత శివ నిర్వాన దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం రవితేజ సినిమా కోసం శివ నిర్వాన ప్రీ ప్రొడక్షన్ పనులను ఫుల్ వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాలో హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే రవితేజ హీరో గా రూపొందబోయే సినిమాలో ప్రియ భవాని శంకర్ ను హీరోయిన్గా తీసుకోబోతున్నట్లు , ఇప్పటికే ఈ ముద్దు గుమ్మను కలిసి ఈ సినిమా కథను శివ వినిపించినట్లు , ఆమెకు కూడా ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే రవితేజ , శివ కాంబో లో రూపొందబోయే  సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే శివ నిర్వాన ఆఖరుగా విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఖుషి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt