టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని ఆఖరుగా నటించిన ఏడు మూవీ లకి ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రీ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

తాజాగా రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ రేపు అనగా నవంబర్ 27 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 27.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రామ్ హీరో గా రూపొందిన డబల్ ఇస్మార్ట్ మూవీ కి వరల్డ్ వైడ్ గా 48 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక రామ్ హీరో గా రూపొందిన స్కంద మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 46.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ది వారియర్ మూవీ కి 38.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రెడ్ మూవీ కి 14 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈస్మార్ట్ శంకర్ మూవీ కి 20.28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక హలో గురు ప్రేమ కోసమే మూవీ కి 24 కోట్ల ప్రీ బిజినెస్ జరిగింది. రామ్ తాజాగా హీరో గా రూపొందిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దానితో ఈ మూవీ కి రామ్ పూర్వపు సినిమాలతో పోలిస్తే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ రామ్ ఆఖరుగా నటించిన మూడు సినిమాల కంటే కూడా ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ కి తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక రామ్ హీరో గా రూపొందిన ఆఖరి నాలుగు మూవీలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఆ ప్రభావం తోనే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాపై మంచి అంచనాలు ఉన్న పెద్ద స్థాయి ప్రీ రిలీస్ బిజినెస్ ఈ మూవీ కి జరగలేదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: