నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ సంవత్సరం ప్రారంభంలో డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది. ప్రగ్యా జైస్వాల్మూవీ లో హీరోయిన్గా నటించగా ... బాబి కొల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ విడుదల ముందు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానితో ఈ మూవీ కి అద్భుతమైన ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు ప్రపంచ వ్యాప్తంగా జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాకు నైజాం ఏరియాలో 17.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ నైజాం ఏరియాలో భారీ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరి లోకి దిగింది. టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి డాకు మహారాజ్ సినిమా నైజాం ఏరియాలో 15.35 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.

దానితో ఈ మూవీ కి నైజాం ఏరియాలో దాదాపు 2.15 కోట్ల రేంజ్ లో లాస్ వచ్చింది. ఇక డాకు మహారాజ్ మూవీ కి నైజాం ఏరియాలో పెద్ద మొత్తం లోనే నష్టం వచ్చిన కూడా తాజాగా బాలయ్య నటించిన అఖండ 2 మూవీ కి నైజాం ఏరియాలో అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నైజాం ఏరియాలో అఖండ 2 మూవీ కి 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ సినిమా 27 కోట్ల షేర్ కలెక్షన్లను నైజాం లో వసూలు చేయనట్లయితే 2 కోట్లు వెనక్కు తిరిగి ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ కండిషన్ ప్రకారం చూసినట్లయితే ఈ మూవీ కి నైజాం ఏరియాలో 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు అవుతుంది. అలా ఈ మూవీ నైజాం ఏరియాలో చాలా పెద్ద టార్గెట్ తో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: