రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్ , రీద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటివరకు మేకర్స్ చాలా ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ఈ మూవీ బృందం వారి విడుదల చేసిన ప్రచార చిత్రాల ప్రకారం ఈ మూవీ హార్రర్ కామెడీ జోనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం ఈ సినిమా బృందం వారు ఈ మూవీ నుండి మొదటి పాటను విడుదల చేశారు.

మూవీ లోని ఫస్ట్ సాంగ్ కి ఓవరాల్ గా మంచి రెస్పాన్స్ జనాల నుండి 24 గంటల్లో లభించింది. కానీ ఓ మీడియం రేంజ్ హీరో సినిమా లిరికల్ వీడియో సాంగ్ వ్యూస్ ను మాత్రం రాజా సాబ్ మూవీ ఫస్ట్ సింగల్ దాటలేకపోయింది. అసలు విషయం లోకి వెళితే ... రాజా సాబ్ మొదటి సింగిల్ కు విడుదల అయిన 24 గంటల్లో 14.92 వ్యూస్ దక్కాయి. ఇక రామ్ పోతినేని హీరో గా రూపొందిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ లోని చిన్ని గుండెలో సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 15.1 మిలియన్ వ్యూస్ దక్కాయి. ప్రస్తుతానికి రాజా సాబ్ మూవీ పై ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలను ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే ఇంకా చాలా రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: