సూపర్ స్టార్ మహేష్ బాబు వల్లే రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీకి దూరమైందా? ఇదెక్కడి ట్విస్ట్ అనుకుంటారు చాలామంది నెటిజెన్లు.అయితే రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ బాబు స్పైడర్ అనే మూవీలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. కానీ ఈ సినిమా రిజల్ట్ తన కెరీయర్ ని దారుణంగా మార్చేసింది అంటూ తాజా ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. రీసెంట్గా దే దే ప్యార్ దే -2 మూవీ తో బాలీవుడ్ లో హిట్ కొట్టిన రకుల్ ప్రీత్ సింగ్సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. మహేష్ బాబుతో కలిసి నటించిన స్పైడర్ మూవీ నన్ను చాలా నిరాశపరిచింది. 

సినిమా నా సినీ కెరీర్ లోనే వచ్చిన అతిపెద్ద తొలి డిజాస్టర్ మూవీ. ఈ సినిమా వల్ల చాలా మానసిక వేదన అనుభవించాను. అలాగే ఈ సినిమాలో నటించి విమర్శలు మూటగట్టుకున్నాను. ఇందులో వచ్చిన నెగిటివ్ ఎనర్జీ వల్ల టాలీవుడ్ కి దూరం అవ్వాలి అనుకున్నాను. అందుకే ఈ సినిమా తర్వాత వచ్చిన ఏ ప్రాజెక్టును కూడా అంత తొందరగా ఒప్పుకోలేదు.చాలా సినిమాలు రిజెక్ట్ చేశాను. మహేష్ బాబు స్పైడర్ మూవీ నాకు నిరాశను మిగిల్చింది.అందుకే టాలీవుడ్ కి దూరమయ్యాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది రకుల్ ప్రీత్ సింగ్.

అయితే రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో మహేష్ బాబు అభిమానులు రకుల్ పై ఫైర్ అవుతున్నారు. నీకు అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరమైతే మహేష్ బాబు సినిమా వల్లే ఇండస్ట్రీకి దూరమయ్యాను అంటున్నావా..అసలు టాలీవుడ్లో నీకు అవకాశం ఇవ్వాలని ఎవరైనా దర్శకులు వెయిట్ చేస్తున్నారా.. టాలీవుడ్ లో ఆఫర్స్ లేకనే బాలీవుడ్ లో బోల్డ్ రోల్స్ చేస్తూ సినిమాల్లో నెట్టుకు వస్తున్నావు.. అలాంటి నువ్వు మహేష్ బాబు సినిమా వల్లే టాలీవుడ్ కి దూరమయ్యాను అనడం ఏమాత్రం సమంజసంగా లేదు అంటూ మండి పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: