సౌత్,నార్త్ లో మంచి గుర్తింపుతో ఇండస్ట్రీలో రాణిస్తున్న తమన్నా భాటియా తాజాగా తన డ్రీమ్ రోల్ ఏంటో బయట పెట్టింది.మరి తమన్నా డ్రీమ్ నెరవేరుతోందా.. దానికి బోనీ కపూర్ ఒప్పుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. మరి తమన్నా డ్రీం కి బోనీకపూర్ ఒప్పుకోవడం ఏంటని మీ అందరికీ ఓ డౌట్ రావచ్చు.. అయితే తమన్నా డ్రీమ్ ఏంటంటే.. శ్రీదేవి బయోపిక్ లో నటించడమట.అవును మీరు వినేది నిజమే..తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా నా డ్రీమ్ రోల్ అంటూ ఏదైనా ఉంది అంటే అది శ్రీదేవి గారి పాత్రలో నటించడమే అంటూ ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.అయితే ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో నటీనటుల బయోపిక్ లు తెరకెక్కించడం ట్రెండ్ గా మారింది. 

అలా సావిత్రి,సీనియర్ ఎన్టీఆర్, సిల్క్ స్మిత ఇలా కొంతమంది సెలబ్రిటీల బయోపిక్స్ తెరికెక్కాయి.అయితే ఈ నటీనటుల బయోపిక్స్ లాగే శ్రీదేవి బయోపిక్ తీసే అవకాశం ఉంటే కచ్చితంగా అందులో తనే హీరోయిన్ గా చేయాలి అనుకుంటున్నట్టు తమన్నా క్లారిటీ ఇచ్చింది.అలాగే చిన్నప్పటి నుండి శ్రీదేవి గారు అంటే నాకు చాలా ఇష్టమని,ఆవిడ స్టైల్, స్క్రీన్ ప్రజెన్స్ ఎంతో ఇష్టమని..ఒక్కసారైనా సరే శ్రీదేవి గారి పాత్ర పోషించాలనే డ్రీమ్ నాకు ఉంది అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.. మరి తమన్నా డ్రీమ్ నెరవేరాలి అంటే బోనీకపూర్ ఒప్పుకోవాలి.

ఎందుకంటే గతంలో శ్రీదేవి బయోపిక్ తీయడానికి కొంత మంది ముందుకు వస్తే..శ్రీదేవి బయోపిక్ ని తీయడానికి నేను అనుమతి ఇవ్వను.. శ్రీదేవి పర్సనల్ జీవితం గురించి చూపించే అవకాశం ఎవరికీ ఇవ్వను అంటూ తేల్చి చెప్పారు. అలా బోనీకపూర్ శ్రీదేవి బయోపిక్ కి ఒప్పుకోకపోవడంతో తమన్నా డ్రీమ్ ఫుల్ ఫీల్ అయ్యేలా కనిపించడం లేదు. ఒకవేళ బోనికపూర్ భవిష్యత్తులో తన మనసు మార్చుకొని శ్రీదేవి బయోపిక్ తీయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం అందులో తమన్నా శ్రీదేవి పాత్ర పోషిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: