ఏళ్లుగా ‘శ్శంభ్29’ అనే వర్కింగ్ టైటిల్‌తో చర్చల్లో ఉన్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఇటీవల హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ‘గ్లోబ్ ట్రోటర్’ ఈవెంట్‌ను నిర్వహించి అధికారిక టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. వేలాదిమంది అభిమానుల హజరుతో జరిగిన ఈ మహా ఈవెంట్ అక్షరాలా వైభవంగా మారిపోయింది. గ్లింప్స్‌లో రుద్రగా మహేశ్ బాబు ఎంట్రీ, ముఖ్యంగా నందీశ్వరుడి దివ్యనేపథ్యంలో ఆయన కనిపించిన ఎపిక్ ఫ్రేములు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. వృషభంపై మహేశ్ ఇచ్చిన రౌడీ ఎంట్రీ కేకలు, చప్పట్లతో వేదికను కుదిపేసింది.
తాజాగా విడుదలైన బిహైండ్-ది-సీన్స్ వీడియో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను ఇంకాస్త ఆకాశానికి చేరుస్తోంది. వృష్టభం సెటప్ చేయడం నుంచి మహేశ్ పవర్‌ఫుల్ ఎంట్రీ వరకు, ప్రతి షాట్‌ను రాజమౌళి ఎంత క్లిష్టమైన డీటైల్‌తో తీర్చిదిద్దారో ఆ వీడియో స్పష్టంగా చూపిస్తోంది. సినిమా కోసం ఎంత కష్టపడతారో, అదే స్థాయి శ్రద్ధను ఈవెంట్ కోసం కూడా పెట్టిన తీరు జక్కన్న డెడికేషన్‌కు అద్దం పడుతోంది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్—“రాజమౌళి డెడికేషన్ అనేది వేరే లెవెల్!”, “మహేశ్ ఎంట్రీ గూస్‌బంప్స్!”, “ఇంత పర్‌ఫెక్షన్ సాధ్యం అవుతున్నదంటే జక్కన్నకే సాధ్యం!” అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘వారణాసి’లో మహేశ్ బాబు రుద్ర పాత్రలో విలక్షణమైన భావోద్వేగం, ఆధ్యాత్మికత, యాక్షన్‌ల మేళవింపుతో కనిపించబోతుండగా, ప్రియాంక చోప్రా “మందాకినీ”గా కీలక పాత్రలో కనిపించడం మరింత ఆసక్తిని పెంచుతోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ “కుంభ” అనే పాత్రలో కథకు మరింత బరువు తెచ్చే విధంగా నటించనున్నట్లు సమాచారం. ఎంఎం కీరవాణి అందిస్తున్న సంగీతం, రాజమౌళి విజనరీ మేకింగ్, టాప్ నాచ్ టెక్నికల్ వాల్యూస్—అన్ని ఈ సినిమాను ఒక విజువల్ స్పెక్టాకిల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి