టాలీవుడ్‌ దర్శకధీరుడు ఎస్ ఎస్  రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ . ఈ సినిమా గురించి ఎలాంటి వార్తలు వినిపిస్తున్నాయో అందరికి తెలిసిందే. రోజురోజుకు అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం పక్కా అంటున్నారు జనాలు.  ఈ చిత్రాన్ని రామాయణం ప్రేరణగా తీసుకుని తెరకెక్కిస్తున్నట్లు జక్కన్న వెల్లడించిన నాటి నుండి సినిమా చుట్టూ హైప్ మరింతగా పెరిగిపోయింది. మహేష్ బాబు ఇందులో శ్రీరాముడి తరహా ఓ దివ్యమైన పాత్రలో కనిపించనున్నారనే సమాచారం బయటకు రావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానులు, సినీ వర్గాల్లో ఆసక్తి పీక్స్‌కి చేరింది.


ఇప్పటి వరకు పెద్ద మిస్టరీగా ఉన్న అంశం—రామాయణంలో కీలకమైన హనుమంతుడి ప్రేరణతో రూపొందించిన పాత్రను ఎవరు చేస్తున్నారు? అన్న ప్రశ్న. తాజా సమాచారం ప్రకారం, ఆ పాత్రకు ఆర్. మాధవన్ ఫైనల్ అయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది. ఈ పాత్రలో హనుమంతుడి శక్తి, ఆధ్యాత్మికత, భక్తి, ధైర్యం వంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయని చెబుతున్నారు. మాధవన్‌తో కొన్ని కీలక సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరించినట్టుగా కూడా వార్తలు ఉన్నాయి. అయితే ఆయన ఈ పాత్రకు పూర్తిగా సూట్ అవుతారా? అన్న ప్రశ్నపై కూడా సోషల్ మీడియాలో కొన్ని చర్చలు నెలకొన్నాయి.



మరోవైపు, మహేష్ బాబు తండ్రి పాత్రకు ప్రారంభంలో నానా పటేకర్ను అనుకున్నప్పటికీ, ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పాత్ర కోసం మరో సీనియర్ నటుడిని ఫైనలైజ్ చేసే పనులు జరుగుతున్నాయని సమాచారం. హీరోయిన్ పాత్రలో ప్రియాంక చోప్రా కనిపించనుండగా, అదనంగా ఒక అంతర్జాతీయ నటి కూడా సినిమాలో భాగమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజమౌళి తెరకెక్కిస్తున్నందున ఈ ప్రాజెక్ట్‌కి గ్లోబల్ స్కేల్‌లో భారీ విజువల్ ట్రీట్ ఉండబోతోందన్న నమ్మకం ప్రేక్షకుల్లో నెలకొంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా గ్లింప్స్ అందరిని ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమా లో ఓ సర్ ప్రైజింగ్ క్యారెక్టర్ ఉందని..అది త్వరలోనే రివీల్ చేయబోతున్నారని టాక్. మొత్తానికి జక్కన్న అన్ని సీక్రేట్ సర్ ప్రైజ్ గా పెట్టేస్తున్నాడు అనేది మాత్రం వాస్తవం..?!

మరింత సమాచారం తెలుసుకోండి: