తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఈయన నటుడిగా కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఈయన కెరియర్ను మొదలు పెట్టిన తర్వాత చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించాడు. ఈయన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దానితో ఈ సినిమా ద్వారా ఈయనకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన జాతి రత్నాలు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది. దానితో ఈయన క్రేజ్ మరింతగా పెరిగి పోయింది. ఈ మూవీ తర్వాత ఈయన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

ఇలా ఇప్పటివరకు ఈయన హీరోగా నటించిన మూడు సినిమాలలో మూడు సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో ఈయనకు హీరో గా అద్భుతమైన గుర్తింపు ఏర్పడింది. ప్రస్తుతం ఈయన అనగనగా ఒక రాజు అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటివరకు నవీన్ నటించిన మూడు సినిమాలు కూడా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలు కాదు. కానీ అనగనగా ఒక రాజు సినిమా మాత్రం ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందినట్లు అర్థం అవుతుంది. మరి ఈ ఫుల్ లెన్త్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తో నవీన్ పోలిశెట్టి ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: