*చిరు రెమ్యూనరేషన్ – 72 కోట్లు?
సినీ వర్గాల సమాచారం ప్రకారం, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి సుమారు రూ. 72 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా చిరంజీవి పారితోషికం స్థిరంగా పెరుగుతూ వస్తుండగా, ఈ చిత్రం కోసం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఆయన కెరీర్‌లోనే అత్యధికమైనది అని టాక్ వినిపిస్తోంది.ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ పారితోషికం 60–120 కోట్ల మధ్య ఉండగా, అందులో చిరంజీవి స్థానం మళ్లీ మరింత బలపడిందని ఇండస్ట్రీ సర్కిల్స్ భావిస్తున్నాయి.
*సుస్మిత కొణిదెలకు 50% లాభాల్లో వాటా:
ఈ చిత్రాన్ని మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు. నిర్మాతగా ఆమె శైలి, సెట్ డిజైనింగ్, ప్రొడక్షన్ క్వాలిటీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు టీమ్ తెలిపింది. ముఖ్యంగా, ఈ చిత్రంలో సుస్మితకు లాభాల్లో 50 శాతం వాటా ఉండనుందని సమాచారం. ఇదిలా ఉండగా, రెమ్యూనరేషన్ మరియు ప్రొడక్షన్ కాస్ట్ కలిపి ఈ సినిమా మొత్తం బడ్జెట్ భారీగా ఉండే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
*వెంకటేష్ కీలక పాత్రలో – నయనతార హీరోయిన్‌గా:
ఈ చిత్రంలో మరో ప్రత్యేక ఆకర్షణ విక్టరీ వెంకటేష్ చేయనున్న కీలక పాత్ర. చిరంజీవి – వెంకటేష్ స్క్రీన్‌పై ఒకేసారి కనిపించడం చాలా అరుదైన విషయం కావడంతో ఈ కాంబినేషన్‌పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.ఇక హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. గతంలో ‘సైరా’ తర్వాత మళ్లీ మెగాస్టార్‌తో ఆమె జత కడుతుండటం ఈ సినిమాకి మరింత క్రేజ్ తీసుకువచ్చింది. టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్ అంటే స్టార్ల మధ్య భారీ పోటీ. అయితే మెగాస్టార్ సినిమా వస్తోంది అంటే ఫ్యాన్స్ మాత్రమే కాదు, మొత్తం ఇండస్ట్రీ దృష్టి ఈ సినిమాపైనే నిలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి